భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి... అధికారులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి… అధికారులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వర్షాలు, వరదల పరిస్థితిపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి , స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా తో ఫోన్ లో సమీక్షించిన ఎమ్మెల్సీ కవిత ఈ రోజు నిజామాబాద్ లో పర్యటించనున్న స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా చొంగ్తు లోతట్టు ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని అధికారులను కోరిన ఎమ్మెల్సీ కవిత.

 Be Alert For Heavy Rains , Mlc Kalvakuntla Kavitha With Officials , Mlc Kalva-TeluguStop.com

నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.

భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మరియు స్పెషల్ ఆఫీసర్ క్రిస్టిన తో ఫొన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ సౌకర్యం, ఇతర మౌళిక సదుపాయాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సత్వర కార్యచరణ రూపొందించాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

నందిపేట్,సిరికొండ,బోధన్ నియోజకవర్గాలకు మంజూరు చేసిన ప్రత్యేక అంబులెన్స్ లు ప్రజలకు విరివిగా అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

లోతట్టు ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దన్న ఎమ్మెల్సీ కవిత, నష్టాలను అంచనా వేసి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.వరదముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన ఆఫీసర్ క్రిస్టినా మధ్యాహ్నం నిజామాబాద్ లో పర్యటించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube