రంగురంగుల పువ్వులతో ముస్తాబవుతున్న బతుకమ్మ..!

బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణలోని ఆడబిడ్డలు ఏ ప్రాంతంలో ఉన్న ఇంటికి చేరుకుని ఎంతో అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు.

ఆడబిడ్డలు అందరూ ఎంతో అందంగా ముస్తాబవుతూ బతుకమ్మను రంగు రంగు పువ్వులతో అలంకరించి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.అంటూ పాటలు పాడుతూ ఎంతో సంతోషంగా బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటారు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది నేటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.బతుకమ్మ పండుగలో భాగంగా బతుకమ్మను వివిధ రకాల పువ్వులతో అలంకరించడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

తెలంగాణలో బోనాల పండుగ తర్వాత ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటి.ఈ పండుగను ఆడబిడ్డలు అందరూ ఎంతో ఘనంగా వేడుక తమ మాంగల్యం పది కాలాలపాటు చల్లగా ఉండాలని భావిస్తూ ఆ గౌరమ్మకు పూజలు చేస్తారు.

Advertisement

ఈ క్రమంలోనే బతుకమ్మ పండుగను ఎన్నో రంగు రంగు పువ్వులతో ఎంతో అందంగా ముస్తాబు చేసి ఈ పండుగను జరుపుకుంటారు.ఈ పండుగ వర్షాకాలపు చివరిలో జరగటం వల్ల అప్పటికే వర్షాలు విపరీతంగా పడి అన్ని రకాల పుష్పాలు ఎంతో అందంగా వికసిస్తాయి.

వర్షాలు అధికంగా పడటం వల్ల చెరువులు కూడా పూర్తిగా నిండి ఉంటాయి.

ఇక వర్షాకాలంలో వికసించిన ఈ పుష్పాలను సేకరించి వాటితో గోపురం మాదిరి అలంకరించి మధ్యలో గౌరమ్మను ఉంచి పూజ చేస్తారు.ఇలా వికసించిన పుష్పాలలో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి.ఇలా బతుకమ్మను సిద్ధం చేసి బతుకమ్మను ఇంటి ముంగిట్లో ఉంచి బతుకమ్మ చుట్టూ ఐదు సార్లు పాటలు పాడుతూ ఆడబిడ్డలు అందరూ తిరుగుతారు.

ఆ తరువాత అందరూ కలిసి బతుకమ్మలను తీసుకొని ఊరేగింపుగా వెళుతూ దగ్గరలో ఉన్నటువంటి చెరువులకు వెళ్లి బతుకమ్మను చెరువులో వదులుతారు.ఇలా బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ,బియ్యం బతుకమ్మ,అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ వెన్నముద్దల బతుకమ్మ, చివరి రోజు సద్దుల బతుకమ్మగా తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

Advertisement

తాజా వార్తలు