మైగ్రేన్ త‌ల‌నొప్పి వ‌ద‌ల‌ట్లేదా? అయితే తుల‌సితో ఇలా చేయాల్సిందే!

ఈ మ‌ధ్య కాలంలో మైగ్రేన్ త‌ల‌నొప్పి బాధితులు రోజు రోజుకు పెరిగి పోతున్నారు.మైగ్రేన్ త‌ల‌నొప్పినే పార్శ్వపు తలనొప్పి అని కూడా అంటారు.

నిద్రలేమి, డీహైడ్రేషన్, అతి నిద్ర‌, అధిక ఒత్తిడి, డిప్రెషన్‌, కంప్యూటర్ల ముందు గంట‌లు త‌ర‌బ‌డి కూర్చుని ప‌ని చేయ‌డం, ఆందోళ‌న‌, పోష‌కాల లోపం, ఎక్కువగా ఏడవటం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణంగా వ‌ల్ల మైగ్రేన్ త‌ల‌నొప్పికి దారి తీస్తుంది.అలాగే వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

ఇది ఒక్క‌సారి మొద‌లైదంటే.కొన్ని గంటల నుంచి కొన్నిరోజుల పాటు వేధిస్తుంది.

దాంతో మైగ్రేన్ త‌ల నొప్పిని నివారించుకునేందుకు ఎన్నో మందులు వాడుతుంటారు.అయితే ఒక్కోసారి ఎన్ని చేసినా మైగ్రేన్ వ‌ద‌ల‌నే వ‌ద‌లదు.

Advertisement
Basil Leaves Helps To Reduce Migraine Headache! Basil Leaves, Migraine Headache,

అలాంట‌ప్పుడు న్యాచుర‌ల్ ప‌ద్ధ‌తుల్లో దీనిని త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.ముఖ్యంగా మైగ్రేన్ త‌ల‌నొప్పిని త‌గ్గించ‌డంలో విశిష్ట ఔషధ గుణాలున్న తుల‌సి ఆకులు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మైగ్రేన్ త‌ల నొప్పితో బాధ ప‌డే వారు.ఒక గ్లాస్ వాట‌ర్‌లో కొన్ని తుల‌సి ఆకుల‌ను క్ర‌ష్ చేసి వేసి బాగా మ‌రిగించి వ‌డ‌బోసుకోవాలి.

ఇప్పుడు ఈ నీటిలో కొద్ది తేనె క‌లిపి సేవించాలి.ఇలా రోజుకు ఒక‌టి రెండు సార్లు చేస్తే మైగ్రేన్ త‌ల నొప్పి నుంచి ఉప‌శ‌నం ల‌భిస్తుంది.

లేదంటే ఫ్రెష్‌గా ఉన్న తుల‌సి ఆకుల‌ను ఐదు చ‌ప్పున రోజుకు మూడు, నాలుగు సార్లు న‌మిలి మింగేయాలి.ఇలా చేసినా మైగ్రేన్ త‌గ్గుతుంది.

Basil Leaves Helps To Reduce Migraine Headache Basil Leaves, Migraine Headache,
Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

ఇక తుల‌సి ఆకుల‌ను తీసుకుంటే ఒత్తిడి, ఆందోళ‌న, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.ద‌గ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతులో గ‌ర‌గ‌ర వంటివి దూరం అవుతాయి.

Advertisement

మ‌రియు బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ లో ఉంటాయి.అందుకే తుల‌సి ఆకుల‌ను మైగ్రేన్ తో ఇబ్బంది ప‌డే వారే కాకుండా.

ఎవ్వ‌రైనా తీసుకోవ‌చ్చు.

తాజా వార్తలు