నిమ్‌హాన్స్‌లో ఉద్యోగాల సందడి.. వేతనాలు కూడా భారీగానే.. !

ప్రస్తుతం దేశంలోని యువత నిరుద్యోగంతో బాధపడుతున్నది.పెద్దపెద్ద చదువులు చదివిన వారు సైతం ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు.

అందుకు ఉదహరణ ఏదైన ప్రభుత్వరంగ సంస్దలో చిన్న పోస్టు కు కూడా గ్యాడ్యుయేట్స్ చదివిన వారు సైతం అప్లికేషన్ పెట్టడమే.ఇక ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు రాక ఎడారిలో నీటి చుక్క కోసం ఎదురుచూసే పక్షుల్లా వీరి జీవితాలు మారిపోయాయి.

ఇదిలా ఉండగా బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఇందులో ఉన్న 275 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇక ఈ ఉద్యోగాలకు చివరి తేదీ జూన్ 28, 2021 వరకు ఉంటుందని, పూర్తి చేసిన దరఖాస్తులు ఆఫ్ లైన్ లో పంపించాలని పేర్కొంది.కాగా దరఖాస్తు ఫీజు గ్రూప్- ఏ పోస్టులకు రూ.2,360.గ్రూప్- పోస్టులకు రూ.1,180 ఖరారు చేశారు అధికారులు.ఇకపోతే ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకుంటే.

Advertisement
Bangalore Based National Institute Of Mental Health And Neurosciences Job Notifi

నర్సింగ్ ఆఫీసర్- 266 పోస్టులు.స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్- 3, కంప్యూటర్ ప్రోగ్రామర్- 1, టీచర్ ఫర్ ఎంఆర్ చిల్డ్రన్ (క్లినికల్ సైకాలజీ)- 1, అసిస్టెంట్ డైటీషియన్- 1, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సబ్ స్పెషాలిటీ బ్లాక్- 1, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (న్యూరోమస్క్యులర్)- 1, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (హ్యూమన్ జెనెటిక్స్)- 1 మొదలగు ఈ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఇక వీరి వేతనాల పట్టికను గమనిస్తే.

Bangalore Based National Institute Of Mental Health And Neurosciences Job Notifi

నర్సింగ్ ఆఫీసర్- రూ.44,990.స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్- రూ.35,400.కంప్యూటర్ ప్రోగ్రామర్- రూ.35,400.అసిస్టెంట్ డైటీషియన్- రూ.35,400.సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (న్యూరోమస్క్యులర్)- రూ.67,700. టీచర్ ఫర్ ఎంఆర్ చిల్డ్రన్ (క్లినికల్ సైకాలజీ)- రూ.35,400.సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (హ్యూమన్ జెనెటిక్స్)- రూ.35,400.జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సబ్ స్పెషాలిటీ బ్లాక్- రూ.44,900.పూర్తి వివరాలను https://nimhans.ac.in/ వెబ్‌సైట్‌ లో చూడొచ్చు.దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Director, NIMHANS, P.B.No.2900, Hosur Road, Bengaluru – 560 029..

అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!
Advertisement

తాజా వార్తలు