ఎమ్మెల్యేగా ఓడిపోయినా పండగ చేసుకుంటున్న బండి సంజయ్ .. కారణం..?

ఒకప్పటి బిజెపి బాస్ బండి సంజయ్ ( Bandi Sanjay ) అంటే తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తలకు ఇతర ప్రజలకు కూడా ఎంతో ఆత్మీయత కలిగిన నాయకుడు.

ఒకప్పుడు తెలంగాణలో బిజెపి అంటే తెలియదు.

కానీ మొదటిసారి బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలుపొంది బిజెపిని తారస్థాయికి తీసుకెళ్లారని చెప్పవచ్చు.తెలంగాణలో బిజెపి వర్సెస్ బీఆర్ఎస్ ( BRS ) అనే విధంగా ఒకానొక టైంలో వార్తలు వినిపించాయి.

కానీ ఎప్పుడైతే ఈటల రాజేందర్ వర్గం బిజెపిలోకి వచ్చిందో ఇక అప్పటినుంచి బండి సంజయ్ కి చెక్ పడిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అనుకుంటూ వచ్చారు.అంతే కాకుండా బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన బిజెపి పూర్తిగా అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి డల్ అయిపోయింది.

Bandi Sanjay Who Is Celebrating Despite Losing As Mla.. The Reason , Bandi Sanja

ఇదే అదునుగా భావించిన కాంగ్రెస్ ( Congressv) తారాజువ్వల లేచి అధికారంలోకి వచ్చింది.బీఆర్ఎస్ ఓటమిపాలైంది.ఇవన్నీ పక్కన పెడితే కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి బండి సంజయ్ పోటీ చేసి ఓడిపోయినందుకు అసలు బాధపడడం లేదట.

Advertisement
Bandi Sanjay Who Is Celebrating Despite Losing As MLA.. The Reason , Bandi Sanja

హై కమాండ్ ఆదేశాల మేరకే ఆయన పోటీ చేశారని , అసలు ఆయనకు ఎమ్మెల్యే పోటీ చేద్దామని ఆలోచన కూడా చేయలేదని చెబుతూ వస్తున్నారు.ఆయనకు ఎంపీ పదవి అంటేనే చాలా ఇష్టమని తెలుస్తోంది.

అలాంటి బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తొలిగిపోయిన తర్వాత కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఎంతో ఆశ పడ్డారట.

Bandi Sanjay Who Is Celebrating Despite Losing As Mla.. The Reason , Bandi Sanja

కానీ హై కమాండ్ ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.ఆ తర్వాత కిషన్ రెడ్డి ( Kishan reddy ) పార్టీ పగ్గాలు చేపట్టినా, బిజెపి వర్గాల్లో మాత్రం జోష్ రాలేదు.ఎక్కడికి వెళ్లినా బండి సంజయ్ లేని లోటు కనిపించింది అని చెప్పవచ్చు.

ఇది గమనించినటువంటి హైకమాండు బండి సంజయ్ కి హెలిక్యాప్టర్ ఇచ్చి స్టార్ కంపెనరుగా ప్రచారం నిర్వహించమని ఆదేశాలు జారీ చేసింది.ఆ విధంగానే బండి సంజయ్ ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

దీంతో బిజెపి అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది సీట్లు గెలుచుకుంది.అంటే 2018 ఎన్నికల కంటే ఈసారి కాస్త మెరుగైందని చెప్పవచ్చు.

Advertisement

అలాంటి ఈ ఎలక్షన్స్ లో మాత్రం బండి సంజయ్, ఈటల రాజేందర్( Etela Rajender ) , ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి లాంటి బాహాబాహులే ఓడిపోయారు.అయితే వీరంతా ఓడిపోయి ఎంతో బాధపడుతున్నారట.

కానీ బండి సంజయ్ మాత్రం తాను ఓటమిపాలైనందుకు బాధపడడం లేదట.తన అభిమానులను కార్యకర్తలను మరియు తనకోసం కష్టపడ్డటువంటి ప్రెస్ మిత్రులందరిని పిలిచి మంచి పార్టీ కూడా ఇచ్చారట.

తను రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తానని, హై కమాండ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పోటీ చేశానని అయినా గెలుపు తీరాల దగ్గర దాకా వెళ్లి కొంతలో మాత్రమే ఓడిపోయానని అది ఓటమి కానే కాదని అసలు గెలిచింది నేనే అని చెప్పుకొచ్చారు.రాబోవు ఎన్నికల్లో కరీంనగర్ (Karimnagar) నుంచి లోక్ సభ స్థానం పోటీ చేసి తప్పకుండా విన్ అవుతానని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు