బండి సంజయ్ ప్లాన్.. అదుర్స్ !

తెలంగాణ( Telangana ) బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) మాస్టర్ ప్లాన్ వేశారా ? మరుగున పడిన అంశాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చి కొత్త చర్చలకు తావిస్తున్నారా ? అంటే అవుననే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి.

గతంలో ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగినంతా కాలం రాష్ట్రంలో పార్టీని జెట్ స్పీడ్ తో ముందుకు నడిపించారు.

కానీ ఊహించని విధంగా ఆయనను అద్యక్ష పదవి నుంచి అధిష్టానం తప్పించిన తరువాత.ఆయనలో మునుపటి స్పీడ్ కరువైంది.

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూ వచ్చిన బండి సంజయ్.లోలోపల మాత్రం అధ్యక్షపదవి దూరమైనందుకు తీవ్ర అసహనంతో ఉన్నారని గత కొన్నాళ్లుగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.

వాటికి తగ్గట్టుగానే ఆయన కూడా పార్టీ వ్యవహారాల విషయంలో అంటి అంతనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు.

Advertisement

కాగా సి‌ఎం అభ్యర్థి గా బండి ని ప్రకటించేందుకే అధ్యక్ష పదవి నుంచి తప్పించరనే వాదన కూడా బలంగానే వినిపిస్తూ వచ్చింది.అయితే సి‌ఎం అభ్యర్థి విషయంలో కూడా బండికి ఈటెల( etela ) ద్వారా గట్టి పోటీ నెలకొంది.బీసీ నేతల్లో ఎవరో ఒకరిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని బీజేపీ అధిష్టానం చెప్పడంతో.

బీసీలుగా ఉన్న బండి సంజయ్, ఈటెల రాజేందర్ సి‌ఎం అధ్యక్ష రేస్ లో ఉన్నట్లు వాదన నడుస్తోంది.కాగా ఇటీవల బీజేపీ( BJP ) అధిష్టానం ఈటెల రాజేందర్ కు ఎక్కువ ప్రదాన్యం ఇస్తూ వస్తోంది.

దాంతో సి‌ఎం అభ్యర్థిగా ఈటెలను ప్రకటిస్తారనే భయం బండిని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.

అందుకే పార్టీలో తన పాత్రపై అధిష్టానానికి తెలిసేలా చురకలాంటిస్తున్నారు బండి సంజయ్.అందులో భాగంగానే ఇంతవరకు అధ్యక్ష పదవి విషయంలో స్పందించని బండి.తాజాగా స్పందిస్తూ పోలిటికల్ హీట్ పెంచుతున్నారు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తనను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని ఊహించలేదని, పార్టీకి తాను ఎంతో చేశానని అయినప్పటికి తనపై వేటు పడిందని బండి వ్యాఖ్యానించారు.అంతే కాకుండా తనకు అధ్యక్ష పదవి మళ్ళీ ఇస్తే నిరాకరిస్తానని చెప్పి కొత్త చర్చకు తావిచ్చారు.

Advertisement

అయితే తెలంగాణలో బీజేపీని బలపరిచిన తనకు అధ్యక్ష పదవి విషయంలో అన్యాయం జరిగిందని.అందుకే సి‌ఎం అభ్యర్థిగా తనకు ఛాన్స్ ఇవ్వాలని పరోక్షంగా అధిష్టానంపై బండి అలకపూనినట్లు కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

అందుకే అధ్యక్ష పదవి విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని బండి సంజయ్ నొక్కి చెబుతున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు