ఏపీ ఎన్నికల్లో అభ్యర్ధులకు షాకిచ్చిన బ్యాలెట్ పేపర్.. ?

ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు కాస్త చల్లబడినటుంది.ఎందుకంటే ఏపీలో ఈ ఎన్నికలు మొదలయ్యాయి.

కాగా ఈ ఎన్నికల వివరాలు తెలుసుకుంటే.ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని సమాచారం.

Ballot Paper Shocked The Candidates In The Ap Elections, Kurnool, Panchayat Elec

ఇక జిల్లాలో ఇప్పటి వరకు 27శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు.ఈ  పోటీలో ఉన్న అభ్యర్దులు ఎన్నికల హడావుడిలో పడి చేయకూడని తప్పును చేసారు.

కడుపుబ్బ నవ్వించేలా ఉన్న ఈ ఘటన గురించి తెలుసుకుంటే.కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలంలోని వీరారెడ్డిపల్లిలోని పంచాయితీ ఎన్నికల అభ్యర్ధులు పొరపాటున ఒక గుర్తుపై మరొకరు ప్రచారం చేసుకున్నారట.

Advertisement

అసలు తాము పోటీ చేస్తున్న గుర్తు ఏంటో గమనించకుండానే పప్పులో కాలేశారట.అపోజిషన్ పార్టీ గుర్తుపై ప్రచారం చేసుకునేదాక కూడా వారు చేస్తున్న పొరబాటు గుర్తుకు రాలేదంటే ఎంత పరధ్యానం లో ఉన్నారో గ్రహించండి.

ఇకపోతే ఎన్నికల సమయంలో బ్యాలెట్ పేపర్ చూసిన వారు షాక్ అయ్యారట.కాగా ప్రస్తుతం తమకు చెందిన గుర్తులపై కాకుండా వేరే గుర్తులపై ప్రచారం చేసుకోవడంతో ఈ ప్రభావం వారి గుర్తు పై పడే అవకాశం ఉందని లబోదిబోమంటున్నారట.

గమ్మత్తుగా ఉంది కదా వీరు చేసిన పని.

చంద్రముఖి లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే ఆశ్చర్యపోతారు..!
Advertisement

తాజా వార్తలు