'వీరసింహారెడ్డి' ఫస్ట్ డే కలెక్షన్స్ అసలు లెక్క ఇదే.. బాక్సాఫీస్ దగ్గర ఊచకోతే!

నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఏవైటెడ్ క్రేజీ సినిమా ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతికి పక్కా మాస్ సినిమాతో వచ్చిన బాలయ్య మరోసారి థియేటర్స్ వద్ద మాస్ జాతర చేస్తున్నాడు.

 Balakrishna Veera Simha Reddy Box Office Collections Day 1 Details, Veera Simha-TeluguStop.com

వీరసింహారెడ్డి నిన్న జనవరి 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ సినిమాగ తెరకెక్కిన ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ ను మెప్పించింది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా.విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్స్ వద్ద మాస్ జాతర క్రియేట్ చేస్తూ సంక్రాంతి పండుగను రెండు రోజులు ముందుగానే చూపించేసారు.మరి బాలయ్య కెరీర్ లోనే భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో ముందు నుండే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఇక ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగా ఆకట్టు కోవడంతో నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూసారు.దీంతో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ లో అదరగొట్టింది అని తెలుస్తుంది.బాలయ్య కెరీర్ లో ఎప్పుడు లేనంత కలెక్షన్స్ ను ఈ సినిమా రాబట్టినట్టు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా తెలుస్తుంది.

వీరసింహారెడ్డి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ డే భారీ వసూళ్లు రాబట్టింది.మొదటి రోజు ఏకంగా 54 కోట్ల రూపాయలను రాబట్టినట్టు మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించింది.దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తున్నట్టు తెలుస్తుంది.మరి పండుగ మూడు రోజుల్లో ఈ సినిమా మరింత సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.

చూడాలి బాలయ్య ఎంత వసూలు చేస్తాడో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube