బాలయ్య అన్‌ స్టాపబుల్‌ 2 షూటింగ్‌ ప్రారంభం... ఫస్ట్‌ గెస్ట్‌ ఎవరు?

నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 2 అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది అంటూ ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది.

అతి త్వరలోనే అన్ స్టాపబుల్ కార్యక్రమం మీ ముందుకు రాబోతుంది అంటూ ఆహా ప్రకటించిన నేపథ్యం లో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయింది అంటూ ప్రచారం జరుగుతోంది.మొన్నటి వరకు గోపీచంద్ మల్లినేని దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా కు సంబంధించిన షూటింగ్ లో బిజీగా ఉన్న బాలకృష్ణ తాజాగా అన్ స్టాపబుల్ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఓకే చెప్పాడు.

అయితే షో సీజన్ 2 యొక్క మొదటి గెస్ట్ ఎవరు అనేది అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే మొదటి గెస్ట్ కన్ఫామ్ అయ్యాడని అయితే ఆ విషయమై అతి త్వరలోనే అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ తెలుస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి తన గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమం కోసం బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమానికి గెస్ట్ గా వస్తే బాగుంటుందని ప్రేక్షకులు అంతా కోరుకుంటున్నారు.అదే జరగబోతుందని అంటున్నారు.

Advertisement
Balakrishna Unstoppable With NBK 2 Interesting Update Details, Unstoppable With

అది నిజమైందా లేదా అనేది చూడాలి.

Balakrishna Unstoppable With Nbk 2 Interesting Update Details, Unstoppable With

ఒకవేళ మొదటి ఎపిసోడ్ లో కాకున్నా చివరి ఎపిసోడ్ లో అయినా మెగాస్టార్ చిరంజీవి కచ్చితంగా బాలకృష్ణ అన్‌ స్టాపబుల్ కార్యక్రమంలో గెస్ట్ గా కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం బాలయ్య అన్‌ స్టాపబుల్ కోసం మళ్లీ కొత్త సెట్ నిర్మాణం జరుగుతుందని ప్రచారం కూడా ప్రచారం జరుగుతుంది.రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఆహా ఓటీటీ లో ఈ షో సీజన్ 2 కూడా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అది ఎప్పుడు అనేదే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు