మహేష్ బాబు ప్రేమ పెళ్లి గురించి బాలయ్య ప్రశ్నలు.. ఆ మూడేళ్లు కష్టం అంటూ?

నందమూరి నటసింహం బాలకృష్ణ కేవలం వెండి తెరపై హీరోగా మాత్రమే కాకుండా ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకేఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ఈ కార్యక్రమానికి ఎంతో మంచి గుర్తింపు తీసుకు వచ్చారు.ఈ కార్యక్రమం మొదట్లో బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు అని తెలియడంతో బాలయ్య ఏంటి? హోస్టింగ్ చేయడం ఏంటని? చాలా మంది ప్రశ్నించారు.

అయితే బాలయ్య తన టాలెంట్ తో వీరందరి నోరు మూయించారు.

ఇలా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా నిలిచిన ఈ కార్యక్రమం నేటితో మొదటి సీజన్ పూర్తి చేసుకోనుంది.ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు హాజరయ్యి ఎన్నో విషయాలను ఆహా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇలా ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా మంచు మోహన్ బాబును ఆహ్వానించారు.ఇలా మొదటి ఎపిసోడ్ ఎంతో సక్సెస్ కావడంతో ఆ తర్వాత ఎపిసోడ్లన్నీ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

Balakrishna Questions About Mahesh Babu Love Marriage Balakrishna, Mahesh Babu,

ఇక ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఈ ఎపిసోడ్ పై ఎన్నో అంచనాలు పెంచాయి.తాజాగా నేడు రాత్రి 8 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కావడంతో నిర్వాహకులు మరొక ప్రోమోని విడుదల చేశారు.

Advertisement
Balakrishna Questions About Mahesh Babu Love Marriage Balakrishna, Mahesh Babu,

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Balakrishna Questions About Mahesh Babu Love Marriage Balakrishna, Mahesh Babu,

ఈ ప్రోమోలో భాగంగా బాలకృష్ణ మహేష్ బాబును ఒక కోరిక కోరారు.మహేష్ బాబు నోటిగుండా తన సినిమా డైలాగులు వినాలని చెప్పడంతో ఆ ప్రశ్నకు మహేష్ బాబు స్పందిస్తూ మీ డైలాగులు మీరు తప్ప మరెవరూ చెప్పలేరని సమాధానం చెప్పడంతో బాలకృష్ణ ఎంతో మురిసి పోయారు.ఇలా బాలకృష్ణ మహేష్ బాబుతో మాట్లాడుతూ చిన్నప్పుడు నువ్వు చాలా నాటీ అని విన్నాను చేసేవన్నీ చేస్తూ చాలా సైలెంట్ గా ఉంటావు అంటూ మహేష్ బాబు గురించి ప్రస్తావించారు.

ఇలా బాలకృష్ణ తన గురించి చెప్పడంతో మహేష్ బాబు ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు.

ఇకపోతే మహేష్ బాబు తన కేరీర్ లో మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకోవడం గురించి కూడా ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ మహేష్ బాబును ప్రశ్నించారు.ఇక ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆ సమయంలో నన్ను నేను కరెక్ట్ గా సరిదిద్దుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు.అదే విధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మహేష్ పెళ్లి ప్రస్తావనను బాలకృష్ణ బయటపెట్టారు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఏదో అకేషన్ కి వెళ్తానని చెప్పి నమ్రతను పెళ్లి చేసుకుని వచ్చావంట కదా ఏంటి మేటర్ అంటూ ప్రశ్నించారు.బాలకృష్ణ ఇలా తన పెళ్లి గురించి అడగడంతో మహేష్ బాబు నవ్వుతూ కనిపించారు.

Advertisement

అయితే ఈ ప్రశ్నకు మహేష్ బాబు ఏమని సమాధానం చెప్పారు వీరిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చర్చకు వచ్చాయి.అనే విషయం తెలియాలంటే ఈ రోజు రాత్రి 8 గంటల వరకు వేచి చూడాలి.

ఇక పోతే ఈ కార్యక్రమానికి మహేష్ బాబుతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా హాజరైనట్లు ఇదివరకే ప్రోమోలో చూపించారు.తాజాగా మరొక ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఈ కార్యక్రమం పై మరింత ఆతృతను నెలకొల్పింది.

తాజా వార్తలు