ఎన్టీఆర్‌పై బాలయ్య పరోక్ష విమర్శలు

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్‌’ చిత్రం ఈనెల 14న సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ సందర్బంగా చిత్ర ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ను నిర్వహించారు.

ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.ఆ మధ్య ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఆడియో వేడుక సందర్బంగా నందమూరి బాలకృష్ణ వారసుడు ఎన్టీఆర్‌ అంటూ హరికృష్ణ చెప్పిన విషయం తెల్సిందే.

ఆ విషయంపై చర్చ జరుగుతున్న సమయంలోనే నాకు నేనే పోటీ, నాకు ఎవరు పోటీ లేరు, సాటి రారు అంటూ బాలకృష్ణ సంచలన ప్రకటన చేశాడు.ఎన్టీఆర్‌ క్రేజ్‌ గురించి, నందమూరి హీరోల్లో ఎన్టీఆర్‌ నెం.1 అంటూ ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేయడంతో అంతా కూడా ఎన్టీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా బాలయ్య ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.మొత్తానికి బాలయ్య ఎన్టీఆర్‌ల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.

అయితే మరో వైపు మాత్రం తాజాగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.తనకు బాబాయితో ఎలాంటి శత్రుత్వం లేదు అని, ఆయనతో పోటీ పడే స్థాయి తనకు లేదు అని, తాను నెం.1 కాదు అని, లాగే తాతగారికి తాను ఎప్పటికి వారసుడిని కాదు అని, ఆయన మనవడిగా ఈ గుర్తింపు చాలు అని ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు.

Advertisement
Which Healthier Between Buttermilk And Curd

తాజా వార్తలు