Balakrishna : థియేటర్స్ లోకి బాలయ్య బాబు ఫ్లాప్ సినిమాలు.. అవసరమా అంటున్న నెటిజన్స్?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్( Tollywood Re Release Trend ) ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా హీరోల పుట్టినరోజు( Heroes Birthday ) సందర్భంగా ఆయా హీరోల కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సినిమాలను మరొకసారి థియేటర్ లలో రీ రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ బాగా ఎక్కువ అయ్యింది.కాగా ఇప్పటికే జల్సా, ఖుషి, ఒక్కడు, మురారి, ఆది, త్రీ లాంటి ఎన్నో సినిమాలను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

కాగా రీ రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తున్నాయి.ఒకటి రెండు సినిమాలకు మినహా అన్ని సినిమాలకు బాగానే కలెక్షన్స్ వస్తున్నాయి.

ఇటీవల కాలంలో ఈ ట్రెండు బాగా పెరిగిపోయింది.ఇందులో భాగంగానే తాజాగా బాలయ్య బాబు( Balakrishna ) సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.బాలకృష్ణ నటించిన ఒక్కమగాడు ,లయన్ సినిమాలను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మూవీ మేకర్స్.

Advertisement

మామూలుగా ఇప్పటివరకు హీరోల పుట్టిన రోజులకు కేవలం ఒక్కొక్క సినిమాలు మాత్రమే విడుదల చేయగా ఇప్పుడు ఇంకా బాలయ్య బాబు నటించిన రెండు సినిమాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.వీటిలో ముందుగా 2008 సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఒక్కమగాడు సినిమా( Okka Magadu )ను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.

ఆ తర్వాత లయన్ సినిమా( Lion Movie )లో విడుదల చేయనున్నారు.2015లో సత్యదేవ్ దర్శకత్వంలో వచ్చిన లయన్ మూవీలో బాలయ్య హీరోగా నటించగా త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్ గా నటించారు.ఈ మూవీని రుద్రపాటి రమణారావు నిర్మించారు.

అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి.రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కాస్త ధైర్యం చేసుకొని ఈ రెండు సినిమాలను మరోసారి థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.

నెటిజన్స్ అభిమానులు( Balakrishna Fans ) మాత్రం హిట్ అయిన సినిమాలు విడుదల చేయకుండా ఫ్లాప్ అయిన సినిమాలను విడుదల చేయడం అవసరమా అంటూ తిట్టిపోస్తున్నారు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు