'భగవంత్ కేసరి' క్లోసింగ్ కలెక్షన్స్..కేవలం ఆ నాలుగు ప్రాంతాల్లో తప్ప అన్నిట్లో లాస్!

నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) రీసెంట్ గానే దసరా కానుకగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమాతో పాటు రెండు క్రేజీ సినిమాలు విడుదల అయ్యినప్పటికీ కూడా బాలయ్య బాబు తన డామినేషన్ ని చూపించాడు.

ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా కాబట్టి ఈ చిత్రానికి ఓపెనింగ్స్ పెద్దగా లేకపోయినా ఫుల్ రన్ లో మంచి రన్ ని దక్కించుకుంది.అసలు బ్రేక్ ఈవెన్ అసాధ్యం అని అనుకున్న ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు ఈ చిత్రం రన్ ని చూసి.

ఓవరాల్ గా 68 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పుడు దాదాపుగా క్లోసింగ్ కి వచ్చేసింది.ఒక్కసారి ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 65 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించినట్టు తెలుస్తుంది.అంటే బ్రేక్ ఈవెన్ మార్కుకి మూడు కోట్ల రూపాయిలు తక్కువ అన్నమాట.నైజాం, ఓవర్సీస్, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలలో మినహా, ఈ సినిమాకి మిగిలిన అన్నీ ప్రాంతాలలో నష్టాలు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Advertisement

లాంగ్ రన్ బాగున్నప్పటికీ ఓపెనింగ్స్ లో వెనకబడడం వల్లే ఈ చిత్రానికి క్లోసింగ్ కలెక్షన్స్( Bhagavanth Kesari Collections )) దగ్గర కి వచ్చేసరికి నష్టాల్లోకి వెళ్లిపోయిందని అంటున్నారు.ఇప్పటికీ ఈ చిత్రం పలు థియేటర్స్ లో విజయవంతంగానే నడుస్తుంది కానీ, షేర్ వసూళ్లు రావడం దాదాపుగా తగ్గిపోయాయి.

షేర్ వచ్చినా కూడా అది అంతంత మాత్రం గానే ఉంది.ఓవరాల్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెమి హిట్ గా నిల్చింది అని చెప్పొచ్చు.

కెరీర్ లో చాలా కాలం తర్వాత బాలయ్య బాబు( Balakrishna ) ఇలా వరుసగా మూడు హిట్స్ కొట్టడం జరిగింది.వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు చేస్తూ కెరీర్ లో బాగా వెనకబడ్డ బాలయ్య, ఇక సినిమాలు ఆపేస్తే మంచిది అని అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్న రోజుల్లో వచ్చిన అఖండ( Akhanda ) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం తో మొదలైన బాలయ్య జైత్ర యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..
Advertisement

తాజా వార్తలు