నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.
మే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా కు ఉగాది సందర్బంగా టైటిల్ ను రివీల్ చేసేందుకు బోయపాటి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను అన్ని ఏరియాల్లో ముందస్తుగానే అమ్మేస్తున్నారు.మిర్యాల రాజేందర్ నిర్మిస్తున్న ఈ సినిమా కు అన్ని ఏరియాల్లో కూడా మంచి రేటు వస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆశ్చర్యకరంగా ఈ సినిమా ను ఓవర్సీస్ లో కూడా మంచి మొత్తంకు కొనుగోలు చేసేందుకు ప్రైడ్ సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.బాలయ్య సినిమా అక్కడ కోటి రూపాయలు వసూళ్లు చేయడం చాలా గొప్ప విషయం.
అలాంటిది ఈ సినిమాను అక్కడ విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్ లు ఏకంగా రెండున్న కోట్ల రూపాయలను వ్యచ్చించినట్లుగా చెబుతున్నారు.పెద్ద మొత్తంలో డబ్బులు వసూళ్లు అవుతున్న నేపథ్యంలో దర్శకుడు బోయపాటి మరింత జాగ్రత్తగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
నైజాం మరియు సీడెడ్ లో ఈ సినిమా రాబడుతున్న మొత్తంతోనే బడ్జెట్ రికవరీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.బాలయ్య గత కొంత కాలంగా చాలా డల్ గా వసూళ్లను రాబడుతున్నాడు.
ఈమద్య కాలంలో ఆయన బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలే లేవు.అయినా కూడా ఈ సినిమా కు బోయపాటి దర్శకత్వం వహించాడు అనే ఒకే ఒక్క కారణంతో భారీ ఎత్తున ఈ సినిమా ను కొనుగోలు చేస్తున్నారు.
గత కొంత కాలంగా బాలయ్య సినిమాలు పది కోట్లు రాబడితే గొప్ప విషయంగా ఉంది.అలాంటిది ఈ సినిమా పాతిక కోట్లకు పైగానే బిజినెస్ చేస్తున్న కారనంగా అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సింహా మరియు లెజెండ్ ల స్థాయిలో ఉంటేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది.మరి ఎలా ఉంటుందో చూడాలంటే మే వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy