బాలయ్య, బాబీ సినిమా అప్డేట్‌... ఫ్యాన్స్ కి మసాలా ట్రీట్ ఖాయం

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హీరో గా బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమా లు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధించాయి.

ఆకట్టుకునే కథ లు ఎంపిక చేసుకుంటూ బాలయ్య దూసుకు పోతున్నాడు.

ఇలాంటి సమయం లో బాలయ్య నుంచి రాబోతున్న బాబీ మూవీ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.చిరంజీవి తో వాల్తేరు వీరయ్య ( Waltheru Veeraya )వంటి కమర్షియల్‌ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాలయ్య నుంచి సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం తో ఉన్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ విషయం లో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అసలు విషయం ఏంటి అంటే ఇప్పటికే సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది.

Advertisement

కీలకమైన రెండు షెడ్యూల్స్ ను దర్శకుడు బాబీ ముగించాడు.అందులో ఒక మాస్ మసాలా యాక్షన్‌ సన్నివేశం కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి.మొత్తానికి బాలయ్య తో దర్శకుడు బాబీ( Director Bobby ) రూపొందిస్తున్న సినిమా ఫుల్‌ లెంగ్త్‌ మాస్ మసాలా మూవీ అన్నట్లుగా ఉంటుంది అంటూ సమాచారం అందుతోంది.

అఖండ సినిమా తో పోల్చితే బాబీ రూపొందిస్తున్న సినిమా కాస్త విభిన్నంగా ఉండటం తో పాటు ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే విధంగా ఉంటుందని అంటున్నారు.మొత్తానికి బాలయ్య, బాబీ మూవీ నందమూరి ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్‌ మాస్ అభిమానులకు కూడా మంచి మసాలా ట్రీట్‌ అన్నట్లుగా నెటిజన్స్ లో చర్చ జరుగుతోంది.

ముందు ముందు ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు విషయాలు వెళ్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి.బాలయ్య కు ఈ సినిమా తో డబుల్ హ్యాట్రిక్ సాధ్యమేనా అనేది తెలియాలి అంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు