నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కు సంబంధించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా టైటిల్ ను ఇంకా ప్రకటించలేదు.
అయితే సినిమా లో బాలయ్య రోల్ అత్యంత పవర్ ఫుల్ గా చాలా విభిన్నంగా, మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటే దర్శకుడు బాబీ సన్నిహితులు అంటున్నారు.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే సంక్రాంతికి సినిమాకు సంబంధించిన ఒక పవర్ ఫుల్ లుక్ ను పోస్టర్ గా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.అంతే కాకుండా సినిమాకు సంబంధించిన ఒక మేకింగ్ వీడియోను కూడా విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు.
ప్రస్తుతానికి సినిమా యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ అనుకున్న సమయంకు పూర్తి అయితే వెంటనే సంక్రాంతి సర్ ప్రైజ్ కి సంబంధించిన ఏర్పాట్లతో దర్శకుడు బాబీ ( Bobby )రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.వరుసగా అఖండ, వీర సింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య ఇప్పుడు బాబీ సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు.
అదే జరిగితే ఈ మధ్య కాలంలో వరుసగా నాలుగు విజయాలు దక్కించుకున్న హీరో లు ఎవరు లేరు.అది కేవలం బాలయ్య మాత్రమే అవుతుంది.ముఖ్యంగా తోటి సీనియర్ హీరో ల్లో నెం.1 గా బాలయ్య నిలిచే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి బాబీ చాలా అంచనాలను బాలయ్య సినిమా పై పెంచుతున్నారు.సంక్రాంతికి వచ్చే పోస్టర్ తో సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.