పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిరుత సినిమాతో రామ్ చరణ్( Ram Charan ) తెరంగేట్రం చేశారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచినా చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
అయితే బలగం సినిమాతో( Balagam ) పాపులారిటీ సొంతం చేసుకున్న మురళీధర్ గౌడ్( Muralidhar Goud ) చరణ్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.మా ఆఫీస్ లో పని చేసే ఉద్యోగి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అని ఆయన అన్నారు.
చరణ్ తొలి సినిమా చిరుత ( Chiruta ) రిలీజ్ రోజున ఆ మహిళా ఉద్యోగి బ్యాంక్ పని ఉందని చెప్పి చిరుత మూవీకి వెళ్లిందని ఆయన చెప్పారు.ఆ విషయం నాకు తెలిసి సినిమా ఎలా ఉంది మేడం అని అడగగా చిరుత అని పేరు పెట్టుకున్నా చిట్టెలుకలా ఉన్నాడని ఆమె చెప్పిందని మురళీధర్ గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అప్పటికీ ఇప్పటికీ రామ్ చరణ్ పై ప్రజల్లో అభిప్రాయం మారిపోయిందని ఆయన పేర్కొన్నారు.
చరణ్ తనను తాను ఎంతో మార్చుకున్నాడని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా భాషతో సంబంధం లేకుండా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. రామ్ చరణ్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో పెరగగా చరణ్ తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
చరణ్ కు చరణ్ సాటి అని తండ్రికి తగ్గ తనయుడు అని చరణ్ అనిపించుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ నుంచి ఈతరం హీరోలలో రామ్ చరణ్ నంబర్ వన్ స్థానంలో ఉన్నారు.ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా రామ్ చరణ్ కు మంచి గుర్తింపు ఉండగా రాబోయే రోజుల్లో చరణ్ సాధించే విజయాలు కూడా ఊహించని రేంజ్ లో ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.