కలకత్తా పైన పంజాబ్ విజయం సాధించడానికి ఆ ఒక్క ప్లేయరే కారణమా..?

ఐపీఎల్ సీజన్ 17( IPL Season 17 ) లో భాగంగా కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ టీం లా మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టీం భారీ విక్టరీ ని సాధించింది.

అయితే మొదట బ్యాటింగ్ చేసిన కలకత్తా టీం 261 పరుగులు చేయగా, 262 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ టీం( Punjab Kings Team ) మరొక పరుగు మిగిలి ఉండగానే ఆ స్కోర్ ను ఛేదించింది.

ఇక కలకత్తా టీం లో సాల్ట్ , నరైన్ హాఫ్ సెంచరీ చేసి తమదైన రీతిలో ప్రత్యర్థి బౌలర్ల మీద విరుచుకుపడుతూ భారీ పరుగులు చేశారు.ఇక చేజింగ్ కి వచ్చిన పంజాబ్ టీం ఓపెనర్ లో అయిన ప్రభు సిమ్రాన్, బేయిర్ స్ట్రో( Bairstow ) అద్భుతమైన బ్యాటింగ్ ను కనబరిచారు ఇక అందులో ప్రభు సిమ్రాన్ హఫ్ సెంచరీ చేశాడు.

ఇక బేయర్ స్ట్రో మాత్రం 108 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడమే కాకుండా టీమ్ ను విజయ తీరాలకు చేర్చాడు.ఇక అలాగే శశాంక్ సింగ్( Shashank Singh ) కూడా చాలా బాగా హిట్టింగ్ చేశాడు.28 బంతుల్లో 8 సిక్స్ లు, 2 ఫోర్లు కొట్టి 68 పరుగులు సాధించడమే సాధించాడు.ఇక తను కూడా నాటౌట్ గా మిగిలాడు.

ఇక ఈ సీజన్ ఐపీఎల్లో భారీ స్కోర్లు మాత్రం నమోదు అవుతున్నాయి.నిజానికి అందరూ ప్లేయర్లు అద్భుతమైన ఫామ్ ను కనబరుస్తూ ఒక టీమ్ భారీ స్కోర్ కొట్టిన కూడా దాన్ని చేదించి విజయాలను అందుకుంటున్నారు.

Advertisement

మరి ఇలాంటి క్రమంలో ఇక రాబోయే మ్యాచ్ లు కూడా చాలా రసవత్తరంగా మారబోతున్నాయి అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక మొత్తానికైతే ఈ మ్యాచులతో మరోసారి ఐపీఎల్ మ్యాచ్( IPL Match ) చూసే ప్రేక్షకులకు వినోదమైతే దక్కిందనే చెప్పాలి.పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే బేయిర్ స్ట్రో మంచి ఫామ్ లోకి వచ్చి అద్భుతమైన సెంచరీని సాధించడమే దానికి ముఖ్య కారణంగా తెలుస్తుంది.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు