వీర సింహారెడ్డి సినిమాలోని డైలాగులకు కౌంటర్ ఇచ్చిన ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కొన్ని డైలాగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నాయన్న నేపథ్యంలో ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ప్రెస్ మీట్ లు పెట్టడం చేతకానోళ్ళు కూడా సినిమాలలో డైలాగులు చెబుతున్నారు అంటూ కౌంటర్ ఇచ్చారు.సంక్రాంతి సంబరాల్లో భాగంగా అనంతపురం మండలం ఏ నారాయణపురం వద్ద రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహించారు.

 Byreddy Siddharth Reddycountered The Dialogues Of Veera Simha Reddy Movie, Veera-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ వీళ్ళు ఎన్ని సినిమా డైలాగులు చెప్పినా, మీసాలు తిప్పినా తొడలు కొట్టినా మనం నమ్ముకునేది కేవలం ప్రజలనే అని,ఆ ప్రజల అభిమానం ఉన్నంతవరకు సీఎం జగన్మోహన్ రెడ్డి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరని తేల్చి చెప్పారు.

రాష్ట్రంలోని యువత అన్ని రంగాలపై అవగాహన కలిగి ఉండాలి ఏది వాస్తవం ఏది అవాస్తవమో మీరు తెలుసుకోగలగాలి అంటూ సూచించారు.

మేము వస్తే మాకు ఈలలు కొడతారు వాళ్ళు వస్తే వాళ్లకు ఈలలు కొడతారని ఓట్లు వేసేది మాత్రం ఒకరికే వేస్తారు అది జగన్మోహన్ రెడ్డి కే అన్నారు.నాలాంటి యువకులను ఎంతోమందిని ప్రోత్సహించి ఒక స్థానంలో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి పై మీ అందరికీ ప్రేమ ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను సీఎం జగన్ ఉన్నత పదవులు కూర్చోబెట్టారు, వారందరూ సీఎం జగన్ కు అండగా నిలబడాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube