బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు కానుక ఇచ్చిన ఏపీ సర్కార్.. !

క్రీడలను ప్రోత్సహించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో విశాఖ‌ప‌ట్నంలో రెండు ఎక‌రాల స్థ‌లాన్ని పీవీ సింధుకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా చిన గ‌దిలిలో కేటాయించిన భూమిని ప‌శు సంవ‌ర్ధ‌కశాఖ‌ నుంచి యువ‌జ‌న స‌ర్వీసులు, క్రీడల‌కు బ‌ద‌లాయిస్తూ నిర్ణ‌యం తీసుకున్న ఏపీ ప్ర‌భుత్వం ఈ స్ధ‌లంలో సింధూ బ్యాడ్మింటన్ అకాడ‌మీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు చేయాలని, ఈ అకాడ‌మీ ద్వారా ప్ర‌తిభ ఉన్న పేద‌ వారికి లాభాపేక్ష లేకుండా శిక్ష‌ణ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.అంతే కాకుండా ఈ అకాడమీని వాణిజ్య అవ‌స‌రాల‌ కోసం వాడ‌కూడ‌ద‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టంగా వెల్లడించింది.

ఇకపోతే ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిలో రెండు ఫేజుల్లో అకాడ‌మీని నిర్మించ‌నున్న‌ట్టు తెలిపారు పీవీ సింధు.ఇకపోతే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద క్రీడాకారులు వెలుగులోకి వస్తే మరీ మంచిది.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు