బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ని సత్కరించిన చిరంజీవి టాలీవుడ్ ప్రముఖులు..!!

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ని మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో సత్కరించారు.

ఇటీవల టోక్యో నగరంలో జరిగిన ఒలింపిక్స్ లో కాంస్య పతకం పీవీ సింధు సాధించటం తెలిసింది.

వరుసగా రెండు ఒలంపిక్స్ లో. పీవీ సింధు సత్తా చాటడంతో పాటు దేశం గర్వించే రీతిగా రాణించడంతో.మెడల్ సాధించిన తర్వాత ఢిల్లీలో ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పీవీ సింధు ని సత్కరించడం జరిగింది.

Badminton Star Peevi Sindhu Honored By Chiranjeevi Tollywood Celebrities , Chir

ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు.పీవీ సింధు ని సత్కరించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో చిరంజీవి, రాధిక, సుహాసిని, నాగార్జున, చిరంజీవి భార్య సురేఖ తోపాటు అల్లుఅరవింద్.దగ్గుబాటి రానా, రామ్ చరణ్, అక్కినేని అఖిల్, మరి కొంతమంది కుర్ర హీరోలతో పాటు ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement

ఈ సందర్భంగా చిరంజీవి ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.దేశం గర్వించేలా వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన పీవీ సింధు నీ ఆత్మీయుల మధ్య సత్కరించడం ఎంతో సంతోషాన్నిచ్చింది అని పోస్ట్ పెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి.

ఈ క్రమంలో పీవీ సింధు సాధించిన కాంస్య పథకం తో ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ఫోటోలు దిగారు.

Advertisement

తాజా వార్తలు