జగన్ శత్రువులందరినీ ఏకం చేస్తున్న బాబు ? 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపిని అధికారానికి దూరం చేయాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu )ఉన్నారు.

ఖచ్చితంగా టిడిపి అధికారంలోకి రావాలంటే తమ ఒక్కరి బలం సరిపోదని,  జగన్ శత్రువులందరినీ ఏకం చేస్తేనే ఉమ్మడిగా వైసీపీని ఎదుర్కుని అధికారంలోకి రావచ్చు అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.

ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తున్నారు.బిజెపిని కూడా తమ కూటమిలోకి తీసుకువచ్చి వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు .అప్పుడే గెలుపు సులువు అవుతుందని,  ఏపీలో బిజెపికి బలం లేకపోయినా,  కేంద్రంలో బిజెపి సహకారం ఉంటే అన్ని విధాలుగా మేలు జరుగుతుందని బాబు నమ్ముతున్నారు. అందుకే జగన్ ( CM jagan )వ్యతిరేక శక్తులన్నిటిని ఏకం చేసే పనులు నిమగ్నం అయ్యారు.

Babu Uniting All Jagans Enemies , Ysrcp, Tdp, Janasena, Janasenani, Pavan K

ఈ మేరకు కాంగ్రెస్ తోనూ సంప్రదింపులు చేస్తున్నారు.అయితే కాంగ్రెస్ తో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే , బిజెపి ఆగ్రహానికి  గురికావాల్సి వస్తుందని, కాంగ్రెస్( Congress ) తో లోపాయికార ఒప్పందం చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పోటీకి దూరంగా ఉంది.

పరోక్షంగా కాంగ్రెస్ కు సహకారం అందించింది.దీంతో కాంగ్రెస్ కూడా టిడిపి విషయంలో సానుకూలంగా ఉండడంతో,  ఏపీలో దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట.

Babu Uniting All Jagans Enemies , Ysrcp, Tdp, Janasena, Janasenani, Pavan K
Advertisement
Babu Uniting All Jagan's Enemies , Ysrcp, Tdp, Janasena, Janasenani, Pavan K

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల నియామకం అయితే,  షర్మిల( Sharmila ) ద్వారానే జగన్ పై విమర్శలు చేయించేలా,  షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతోనే చెప్పించి.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల్లోనూ జగన్ పై వ్యతిరేకత పెంచే విధంగా బాబు ప్లాన్ చేస్తున్నారట. టిడిపి ,జనసేన, బిజెపి, కాంగ్రెస్ , వామపక్ష పార్టీలు ఇలా అందరూ జగన్ కు వ్యతిరేకంగానే ఏపీ ఎన్నికలకు సిద్ధమవుతుండడంతో,  అవన్నీ తమకు కలిసి వస్తాయని బాబు లెక్కలు వేసుకుంటున్నారట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు