కౌశల్‌ ఆర్మీ పై అనుమానాలు.. వదిలేయండి అంటూ హెచ్చరిక

బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ముగిసింది.

మొదటి రెండు వారాల విషయం పక్కన పెడితే మూడవ వారం నుండి కూడా కౌశల్‌ ఆర్మీ నడిపినట్లుగా బిగ్‌ బాస్‌ సాగిందని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిందే.

కౌశల్‌ ఆర్మీ ఎవరినైతే టార్గెట్‌ చేస్తారో వారు ఎలిమినేట్‌ అవుతూ వచ్చారు.కౌశల్‌ ను ఇంటి నుండి పంపించాలని భావించిన బాబు గోగినేనిని ప్రేక్షకులు బయటకు పంపించిన విషయం తెల్సిందే.

ఇంట్లో ఉన్న సమయంలో బాబు గోగినేని మరియు కౌశల్‌ ల మద్య ఏ స్థాయిలో వివాదం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Babu Gogineni Raising Doubts On Kaushal Army

కౌశల్‌ విజేతగా నిలిచిన తర్వాత కూడా బాబు గోగినేని విమర్శలు చేస్తూనే ఉన్నాడు.కౌశల్‌ ఆర్మీ అనేది ఒక ఫేక్‌ అని, మూడు వేల డాలర్ల పెడితే వేల కొద్ది జీమెయిల్‌ ఐడీలు వస్తాయి.ఆ జీమెయిల్స్‌ నుండి వారే ఓట్లు వేసే విధంగా ఆయన భార్య మరియు ఆయన సన్నిహితులు మాట్లాడుకున్నారు.

Advertisement
Babu Gogineni Raising Doubts On Kaushal Army-కౌశల్‌ ఆర్మీ

ఆ విషయం తెలియని బిగ్‌ బాస్‌ టీం కౌశల్‌ను విజేతగా ప్రకటించారు.కౌశల్‌కు ఎన్నో అడ్వాంటేజెస్‌ ఇచ్చిన బిగ్‌ బాస్‌ టీం ఈ సీజన్‌ సక్సెస్‌ కావడంలో విఫలం అయ్యారు.

బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంట్లో వారు ఉండాలి.కాని కౌశల్‌కు ఎప్పటికప్పుడు బయట ఏం జరుగుతుందో తెలిసి పోయింది.కౌశల్‌ ఆర్మీ గురించి ఆయనకు ఎప్పటికప్పుడు తెలియడంతో పాటు, ఎలిమినేషన్‌ అయిన వారు మళ్లీ ఇంట్లోకి వెళ్లడం ఒక తప్పుడు నిర్ణయం అంటూ ఈ సందర్బంగా బాబు గోగినేని అన్నాడు.

కౌశల్‌ విజయంలో నిజాయితీ లేదు అంటూ బాబు గోగినేని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు.

Babu Gogineni Raising Doubts On Kaushal Army

బిగ్‌బాస్‌ టీం మరియు కౌశల్‌పై బాబు గోగినేని చేస్తున్న విమర్శలపై కౌశల్‌ ఆర్మీ తీవ్ర స్థాయిలో మండి పడినది.ఒక గొప్ప వ్యక్తిని అంటూ తనకు తాను చెప్పుకునే వ్యక్తి ఇలా ఒక విజేతను విమర్శించడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వివాదాన్ని ఇప్పటికైనా వదిలేస్తే బాబు గోగినేని పరువు ఉంటుంది.

అందాన్ని పెంచే అర‌టి ఆకు.. ఎలా వాడాలో తెలుసా?

లేదంటే ఆయనకే నష్టం అంటూ కౌశల్‌ ఆర్మీ హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు