మొటిమల మచ్చలను తొలగించటానికి ఆయుర్వేద ఫేస్ ప్యాక్

చర్మ సమస్యల పరిష్కారానికి మన పూర్వికులు ఆయుర్వేదాన్ని బాగా ఉపయోగించేవారు.చర్మ సమస్యల్లో అధికంగా అందరిని ఇబ్బంది పెట్టె సమస్య మొటిమల సమస్య.

మొటిమలు తగ్గాక వాటి తాలూకు మచ్చలు అలానే ఉండిపోతాయి.మొటిమలు,మచ్చలను సమర్ధవంతంగా తొలగించే కొన్ని ఆయుర్వేద పేస్ పాక్స్ ఉన్నాయి.

వాటిని ఉపయోగిస్తే మొటిమల సమస్య తొలగిపోతుంది.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Ayurveda Face Pack For Pimple Scars,pimple Scars, Ayurveda Tips, Telugu Tips,hom

ఒక స్పూన్ పాలలో అరస్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మొటిమల మచ్చలు తొలగిపోతాయి.అరస్పూన్ శనగపిండిలో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత తేలికపాటి క్లీన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

Advertisement
Ayurveda Face Pack For Pimple Scars,Pimple Scars, Ayurveda Tips, Telugu Tips,Hom

ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మొటిమల మచ్చలు త్వరలోనే తగ్గిపోతాయి.బంతి పూల పేస్ట్ లో రోజ్ వాటర్ కలిపి ముఖం మీద మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మొటిమల మచ్చలు తొలగిపోతాయి.వేపాకుల పేస్ట్ లో అలోవెరా జెల్ వేసి బాగా కలిపి బాగా కలిపి ముఖం మీద మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో నాలుగు సార్లు చేస్తే మొటిమల మచ్చలు తొలగిపోతాయి.

రుద్రాక్షను ధరించిన వారు పాటించాల్సిన నియమాలు ఇవే..!
Advertisement

తాజా వార్తలు