విడుదలకు ఒక రోజు ముందే నెట్ లో లీక్ అయిపోయిన "అవతార్ 2"..!!

ప్రపంచ సినిమా రంగం ఎదురుచూస్తున్న సినిమా “అవతార్ 2“.2009వ సంవత్సరంలో గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ దర్శకత్వంలో వచ్చిన “అవతార్” మొదటి భాగం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.విజువల్ వండర్ గా అవతార్ అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.కాగా మొదటి భాగానికి కొనసాగింపుగా “అవతార్ 2” తెరకెక్కించారు.ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.వరల్డ్ వైడ్ గా 160 భాషలలో రిలీజ్ చేస్తున్నారు.

 Avatar 2 Leaked On The Telegram App A Day Before Its Release Avatar 2, Avatar, J-TeluguStop.com

ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సమయంలో విడుదలకు ఒక రోజు ముందే టెలిగ్రామ్ యాప్ లో “అవతార్ 2” లీక్ అయిపోయింది.దీంతో సినిమా యూనిట్ తలలు పట్టుకుంటుంది.

కొన్ని వేల కోట్లతో చాలా పగడ్బందీగా తెరకెక్కించిన గాని… సినిమా రిలీజ్ కి ఒక రోజు ముందే పైరసీ బారిన పడటంతో ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.అయితే టెలిగ్రామ్ యాప్ లో లీకైన ఈ సినిమా ఏ భాషకు సంబంధించింది అన్నది ఇంకా వివరాలు మాత్రం బయటకు రాలేదు.

ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 16వ తారీకు భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా.ఇప్పటికే బిజినెస్ భారీ ఎత్తున చేసింది.ఇండియాలో ఆరు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.తెలుగులో కూడా విడుదల కానుంది.

ఈ సినిమా రన్  టైం మూడు గంటల 12 నిమిషాల 10 సెకండ్లు.‘అవతార్’కు సీక్వెల్‌గా ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’గా ఈ సినిమా వస్తోంది.

ఇండియాలో దాదాపు పదిలక్షలకు పైగా టికెట్స్ అల్ రెడీ బుక్ అయ్యాయి.ఇలాంటి తరుణంలో నెట్ లో సినిమా లీక్ కావడం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube