ఒకేసారి ఆలయానికి, గురుద్వారాకి .. వైవిధ్యం చాటుకున్న ఆస్ట్రేలియా ప్రధాని

దీపావళి పర్వదినాన్ని( Diwali Festival ) భారతీయులు ఘనంగా జరుపుకున్నారు.మనదేశంతో పాటు విదేశాల్లోనూ ఒకే సమయంలో వేడుకలు జరిగాయి.

భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో ఒకటైన ఆస్ట్రేలియాలోనూ( Australia ) దీపావళిని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్( Anthony Albanese ) శుక్రవారం ఓ హిందూ దేవాలయాన్ని, గురుద్వారాను ఏకకాలంలో సందర్శించారు.

హిందువులు దీపావళి, సిక్కుల చోర్ దివాస్ పండుగలను జరుపుకున్నారు.

61 ఏళ్ల ఆంథోనీ అల్బనీస్ సిడ్నీ శివార్లలోని గ్లెన్‌వుడ్‌లో ఉన్న గురుద్వారాను( Gurdwara ) సందర్శించారు.ఈ సందర్భంగా సిక్కుల సాంప్రదాయ వస్త్రధారణను ప్రధాని ధరించారు.నారింజ రంగు తలపాగా ధరించి, ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తున్న ఫోటోలను ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

ఈ సందర్భంగా గురుద్వారాలో కొత్తగా నిర్మించిన కిచెన్‌ను కూడా అల్బనీస్ ప్రారంభించారు.అలాగే హిందూ కమ్యూనిటీ సభ్యులతో ఫోజులిచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని నవ్వుతూ భక్తులతో దిగిన సెల్ఫీ ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు.

దీపావళీని పురస్కరించుకుని అల్బనీస్ సిడ్నీలోని మురుగన్ ఆలయాన్ని( Sydney Murugan Temple ) సందర్శించారు.అక్కడ తమిళనాడుకు చెందిన భారతీయులతో కలిసి దివాళీ వేడుకల్లో పాల్గొన్నారు.చీకటిపై వెలుగు సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారని ప్రధాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

సిడ్నీలోని మురుగన్ ఆలయం ప్రతిరోజూ అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తుందని, సిడ్నీలోని దక్షిణాసియా హిందూ సమాజానికి అభయారణ్యంగా మారిందని పేర్కొన్నారు.కాగా.రెండ్రోజుల క్రితం వాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరయ్యారు.దాదాపు 600 మందికి పైగా భారతీయ అమెరికన్లు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు.

బిర్యానీ లవర్స్.. కొత్త పార్లే-జి బిస్కెట్ల బిర్యానీ వచ్చేసింది.. ట్రై చేసారా?
కెనడా : భారత సంతతి యువతి మరణంపై ముగిసిన దర్యాప్తు.. ఏం తేల్చారంటే?

ఈ సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ .అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో ఇప్పటి వరకు భారీ దీపావళి వేడుకలను నిర్వహించడం గర్వంగా ఉందన్నారు.సెనేటర్, వైస్ ప్రెసిడెంట్, దక్షిణాసియా అమెరికన్లు తన యంత్రాంగంలో కీలక సభ్యులుగా ఉన్నారని ఆయన తెలిపారు.

Advertisement

కమలా హారిస్ నుంచి డాక్టర్ వివేక్ మూర్తి వరకు మీలో చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని బైడెన్ పేర్కొన్నారు.

తాజా వార్తలు