ఆగస్టు నెల వచ్చేసి అప్పుడే మొదటి వారం ముగిసింది.ప్రతీ నెల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూనే ఉంటాయి.
మరి ఈ నెల కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా మంది వరుసగా తమ సినిమాలతో రాబోతున్నారు.గత రెండు మూడు నెలల కంటే ఈ ఆగస్టు నెల చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
సీనియర్ హీరో చిరంజీవి దగ్గర నుండి యంగ్ హీరోల వరకు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.మరి వాటిలో మూడు సినిమాలు వాయిదా పడ్డాయి.
మూడు వాయిదా పడడంతో ఆగస్టు రేస్ నుండి మినిమమ్ రేంజ్ సినిమాలు దాదాపు సగం పోయినట్టే అని చెప్పాలి.మరి వాటిలో మొదటి సినిమా ఏంటంటే వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ.
ఈ సినిమాను శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై త్రివిక్రమ్ భార్య సౌజన్యతో కలిసి నాగవంశీ నిర్మిస్తున్నారు.శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.
బజ్ కూడా అమాంతం పెరిగింది.అయితే ఈ సినిమా రెండు వారాలు ఉంది అనగా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆగస్టు 18న రిలీజ్ కావాల్సిన మూవీ అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఇక రెండవ సినిమా ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’‘ ( Miss Shetty Mr Polishetty ).అనుష్క శెట్టి ( Anushka Shetty ) హీరోయిన్ గా, నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండడంతో వాయిదా పడింది.
ఇది ఆగస్టు 4న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.

అంతేకాదు శ్రీకాంత్ అడ్డాల పెదకాపు సినిమా( Srikanth Addala )కూడా ఆగస్టు 18న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా వేశారు.టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచిన ఈ సినిమా వాయిదా పడింది.ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు.
ఇలా ఒకే నెలలో రిలీజ్ కావాల్సిన మూడు సినిమాలు వాయిదా పడడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.







