హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు డిశ్చార్జ్ అయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై 15 మంది దాడికి పాల్పడ్డారని తెలిపారు.
అచ్చంపేట ప్రజల దీవెనతో ప్రాణాలతో బయటపడ్డానని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తనపై రాయితో దాడి చేశారన్నారు.
వంశీకృష్ణ గతంలోనూ దాడి చేశారని చెప్పారు.తనపై, తన అనుచరులపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని ఆరోపించారు.
పగలు, ప్రతీకారాలు తమ సంస్కృతి కాదన్న ఆయన దాడి ఘటనపై డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీకి సమాచారం ఇచ్చామని తెలిపారు.తనను ఎదుర్కొనే శక్తి లేక ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఈ క్రమంలోనే తన కాన్వాయ్ ను వెంబడిస్తూ దాడి చేశారని తెలిపారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించారు.







