టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడి..చీపురుప‌ల్లిలో ఉద్రిక్త‌త‌

విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లిలోని రామ‌లింగాపురం గ్రామంలో స్వ‌ల్ప ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.గ్రామంలోని టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై అధికార వైసీపీకి చెందిన వ్య‌క్తులు దాడికి పాల్ప‌డ్డారు.

ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.మ‌రోవైపు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై జ‌రిగిన దాడిని జిల్లా పార్టీ అధ్య‌క్షుడు కిమిడి నాగార్జున ఖండించారు.

కావాల‌నే త‌మ పార్టీ శ్రేణుల‌పై అక్ర‌మంగా దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న‌ ఆరోపించారు.

బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?
Advertisement