దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక షురూ అయిన సంగతి తెలిసిందే.ఉప ఎన్నికలలో టీడీపీ పోటీకి దూరంగా ఉండగా.
బీజేపీ పోటీ పడటానికి రెడీ కావడం తో.అధికార పార్టీ వైసీపీకి.బీజేపీకి మధ్య పోటీ నెలకొంది.ఈ క్రమంలో ఇప్పటికే గత కొద్ది రోజుల నుండి బిజెపి పార్టీ నేతలు ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొని బిజీ బిజీగా గడిపారు.
ఇక వైసీపీ కూడా ఈ ఎన్నికలలో భారీ మెజారిటీ సాధించే దిశగా ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మొత్తం ఆత్మకూరులో ఓటర్ల సంఖ్య 2.14 లక్షల మంది. దాదాపు లక్ష మెజారిటీ సాధించాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.23వ తారీకు పోలింగ్ జరగనుండగా 24వ తారీకు ఫలితాలు ప్రకటిస్తారు.నియోజకవర్గంలో 278 పోలింగ్ కేంద్రాలకు.
రేపు సాయంత్రానికి పోలింగ్ సిబ్బంది చేరుకోనున్నారు.గౌతమ్ రెడ్డి మరణంతో ఈ ఉప ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా గౌతం రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేయనున్నారు.
వైసీపీ అభ్యర్థితో పాటు బిజెపి సహా మొత్తం 14 మంది.ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.