సూపర్ స్టార్ మహేష్ బాబు లైనప్ మిగితా హీరోలకి చెమటలు పట్టించేలా కొనసాగుతోంది.
బ్రహ్మోత్సవం లాంటి క్లాస్ సినిమా తరువాత మురుగదాస్ తో భారి ద్విభాష చిత్రాన్ని ప్లాన్ చేసిన మహేష్, ఆ తరువాత కూడా కేవలం తెలుగు వరకే పరిమతం అయ్యే అలోచనలో లేడు.
రాజా రాణీతో తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుడు అట్లీ.మరోవారం రోజుల్లో ఈ దర్శకుడి రెండొవ చిత్రం తెరి (తెలుగులో పోలీసోడు) విడుదల కానుంది.
విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం మీద మార్కేట్ లో మంచి అంచనాలు ఉన్నాయి.సినిమా మీద ఉన్న నమ్మకంతో, దిల్ రాజు తెలుగులో భారి విడుదలకి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం కూడా హిట్ అయితే అట్లీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది.సూపర్ స్టార్ అభిమానులకి ఇక్కడ చెప్పే గుడ్ న్యూస్ ఏంటంటే, మహేష్ బాబు - అట్లీ కాంబినేషన్లో ఒక ద్విభాష చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయి.
తెరి హిట్ టాక్ సొంతం చేసుకోని, కథ చర్చలు సఫలం అయితే, మురుగదాస్ తరువాత ఈ సినిమా మొదలైనా ఆశ్చర్యపోనక్కరలేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy