అట్లీ మల్టీస్టారర్.. ఆ స్టార్ హీరోలు ఎవరో తెలిస్తే చొక్కాలు చింపుకోవాల్సిందే!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో అట్లీ కుమార్ ( Atlee Kumar ) ఒకరు.ఈయన పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగి పోతుంది.

ఇప్పటికే ఈయన తమిళ్ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు.స్టార్ డైరెక్టర్ గా ఉన్న అట్లీ పైనే ఇప్పుడు అందరి కన్ను పడింది.

అందుకు కారణం ఏంటో అందరికి తెలుసు.ఈయన తెరకెక్కించిన జవాన్ ( Jawan Movie ) సినిమాతో ఇప్పుడు అట్లీ హాట్ టాపిక్ అయ్యాడు.

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan ) తో తెరకెక్కించిన ఈ సినిమా 1000 కోట్లు వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ అయ్యింది.ఈ సినిమా చుసిన తర్వాత అట్లీతో సినిమా చేయాలనీ స్టార్ హీరోలు క్యూ కడుతున్నాడు.

Advertisement

అయితే ఈయన మాత్రం తొందర పడకుండా ఆచితూచి తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు.తాజాగా అట్లీ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చేసాడు.తాను నెక్స్ట్ మల్టీస్టారర్ సినిమాను చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించాడు.

ప్రజెంట్ ఆ కథ పనుల్లోనే బిజీగా ఉన్నట్టు తాజాగా ఇంటర్వ్యూలో తెలిపాడు.

చెన్నయ్ లో జిందా బందా అనే పాట చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్ అన్నని మా పార్టీకి ఆహ్వానించారు.అప్పుడు షారుఖ్ ఖాన్, విజయ్( Vijay ) కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు.నాతొ షారుఖ్ గారు నువ్వు ఇద్దరు హీరోలతో సినిమా చేయాలనుకుంటే చెప్పు మేము ఇద్దరం చేస్తాం.

అన్నారట.విజయ్ గారు కూడా అందుకు ఒప్పుకున్నారని అట్లీ ఓపెన్ అయ్యారు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

మరి ఇద్దరి స్టార్ హీరోల్ని ఒకే ఫ్రేమ్ లో చూపించే అవకాశం దక్కినందుకు నా మనసులో చాలా సంతోష పడ్డాను.ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇద్దరి స్టార్ హీరోల ఇమేజ్ కు తగ్గట్టు కథ ఉండేలా కసరత్తులు చేస్తున్నా.

Advertisement

బహుశా నేను చేయబోయే నెక్స్ట్ సినిమా ఇదే అవుతుంది అంటూ చెప్పి అందరిని సర్ప్రైజ్ చేసాడు అట్లీ.షారుఖ్, విజయ్ దళపతి కాంబో తెరపై ఎలా ఉండబోతుందో చూడాలి.

తాజా వార్తలు