న్యూయార్క్ యూనివర్సిటీలో అడుగుపెట్టిన ట్రంప్ కుమారుడు.. అందరి కళ్లు అతని మీదే !!

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు.ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు బారన్ ట్రంప్( Barron Trump ) వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు.

 At Nyu Barron Trump Shares Campus With Diddys Daughter Details, Barron Trump ,-TeluguStop.com

పెన్సిల్వేనియా యూనివర్సిటీ అనుబంధ వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో( Wharton School of Business ) తన విద్యను పూర్తి చేసిన డొనాల్డ్ ట్రంప్ కంటే బారన్ భిన్నంగా తన కళాశాలను ఎంచుకున్నారు.న్యూయార్క్ యూనివర్సిటీలోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ని ఎంపిక చేసుకున్నారు.

Telugu Barron Trump, Chance Combs, Diddys, Donald Trump, Melania Trump, York, Wh

ఈ అకడమిక్ సెషన్‌లో ఎన్‌వైయూకి హాజరైన ప్రముఖుల పిల్లల్లో బారన్ ట్రంప్‌తో పాటు సంగీత దిగ్గజం సీన్ డిడ్డీ కోంబ్స్ కుమార్తె ఛాన్స్ కాంబ్స్( Chance Combs ) గతేడాది డిసెంబర్‌లో ఎన్‌వైయూ టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరినట్లు పేర్కొన్నారు.వ్యక్తిగత కారణాల నేపథ్యంలో ట్రంప్ న్యూయార్క్‌లో ఉండటానికి అంతగా ఇష్టపడటం లేదు.ఎన్నికల ప్రచారం లేకపోతే ఫ్లోరిడాలోని తన రిసార్ట్‌లోనే ఆయన గడుపుతున్నారు.అయితే ప్రస్తుతం కాలేజీకి వెళ్లాల్సి ఉండటంతో బారన్ .తన తండ్రికి చెందిన ట్రంప్ టవర్‌లో నివసిస్తున్నారు.తల్లి మెలానియాతో కలిసి న్యూయార్క్‌లో ఉండాలని బారన్ భావిస్తున్నారు.

మరోవైపు.డొనాల్డ్ ట్రంప్‌పై రెండవసారి హత్యాయత్నం నేపథ్యంలో ట్రంప్ టవర్ వద్ద సీక్రెట్ సర్వీస్ భద్రతను పెంచింది.

Telugu Barron Trump, Chance Combs, Diddys, Donald Trump, Melania Trump, York, Wh

సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల భద్రత మధ్య గత నెలలో యూనివర్సిటీకి వెళ్లారు బారన్ ట్రంప్. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.డీన్ కార్యాలయాన్ని సందర్శించిన తర్వాత తరగతులకు హాజరయ్యాడు.గతంలో స్టెర్న్ యూనివర్సిటీ నుంచి అతని బావ జారెడ్ కుష్నర్‌ పట్టభద్రుడయ్యాడు.ఎన్‌వైయూలో అన్నే హాత్వే, ఏంజెలీనా జోలీ, లేడీ గాగా, పెడ్రో పాస్కల్ వంటి ప్రముఖులు చదువుకున్నారు.

అయితే ట్రంప్ చరిష్మా నేపథ్యంలో బారన్‌పై అందరి దృష్టి నెలకొంది.

ఇన్నేళ్లుగా అతను బయటి ప్రపంచానికి దూరంగా వున్నాడు.ఆక్స్‌బ్రిడ్జ్‌లో బారన్ చదువుతున్న విషయం, ఇతర అంశాలు ప్రైవేట్‌గా ఉంచారు.

విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు అతని గురించి చెప్పడానికి నిరాకరించారు.బారన్ ఎంతో జనాదరణ పొందారని .అప్పుడప్పుడు తనకు రాజకీయ సలహాలు కూడా ఇస్తాడని ట్రంప్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube