ప్రభాస్ జాతకంలో అటువంటి దోషాలు ఉన్నాయి: గోపాల్ అయ్యేగర్

టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల తర్వాత ప్రభాస్ రెండు పాన్ ఇండియా సినిమాలలో నటించగా ఆ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి.అందులో ఒకటి సాహో కాగా మరొకటి రాధేశ్యామ్.

ఈ రెండు సినిమాలు కూడా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.దీంతో అభిమానులు భారీగా నిరాశ చెందారు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ నటించిన సినిమా ఆదిపురుష్.ఈ సినిమా టీజర్ ఇటీవలే చిత్ర బృందం విడుదల చేయగా విడుదల తర్వాత ఎన్ని రకాల విమర్శలను అందుకోవాలో అన్ని రకాల విమర్శలను అందుకుంది ఆదిపురుష్ టీజర్.

Advertisement

అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు అలాగే చాలామంది ప్రముఖులు ఈ ఆది పరిస్థితి టీజర్ పై మండిపడడంతో పాటు విమర్శలను సైతం గుర్తించారు.ఇది ఇలా ఉంటే గోపాల్ అయ్యగారు ప్రభాస్ జాతకంలో దోషాలు ఉన్నాయి అని తెలిపారు.

ప్రస్తుతం ప్రభాస్ కి చాలా నెగటివ్ టైమ్ నడుస్తోంది.2018 అక్టోబర్ 23 నుంచి ప్రభాస్ కి కేతు మహాదశ స్టార్ట్ అయ్యిందట.ఇది ప్రభాస్ జీవితంలో ఏడు సంవత్సరాల పాటు ఉంటుందట.

కేతు మహాదశ వల్ల తీవ్రమైన వైరాగ్యం ఉంటుందట.దేనిపట్ల ఆసక్తి ఉండదట.

సంసారము కుటుంబం వ్యాపారం దేని పట్ల కూడా ఆసక్తి ఉండదట.కాగా ప్రభాస్ అభిమానులు ఈ వాక్యాలు విని కాస్త భయబ్రాంతులకు లోనవుతున్నారు.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

అంటే ఈ ఏడు సంవత్సరాల వరకు ప్రభాస్ నుంచి వచ్చే ఏ సినిమా కూడా హిట్ అవ్వవా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు