కల్కి2 మూవీకి సంబంధించి షాకింగ్ సీక్రెట్స్ రివీల్ చేసిన అశ్వనీదత్.. ఏం చెప్పారంటే?

నాగ్ అశ్విన్( Nag Aswin ) దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ.

( Kalki 2898 AD ) గత ఏడాది విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కోట్లల్లో కలెక్షన్స్ ను సాధించింది.అంతేకాకుండా భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చింది.

ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ ను ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఇప్పటికే పార్ట్ 2 కి సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Ashwini Dutt About Prabhas Kalki 2898 Ad Part 2 Release Details, Ashwini Dutt, P
Advertisement
Ashwini Dutt About Prabhas Kalki 2898 Ad Part 2 Release Details, Ashwini Dutt, P

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ నిర్మాత అశ్వినిదత్( Ashwini Dutt ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తన అల్లుడు, డైరెక్టర్‌ నాగ్‌అశ్విన్‌ పై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.ఈ సందర్భంగా అశ్వనీ దత్ మాట్లాడుతూ.

కల్కి 2( Kalki 2 ) వచ్చే ఏడాది విడుదల అవుతుంది.రెండో పార్ట్‌ మొత్తం కమల్‌ హాసనే ఉంటారు.

ప్రభాస్,( Prabhas ) కమల్‌ హాసన్‌ల( Kamal Haasan ) మధ్య సన్నివేశాలు ఉంటాయి.అమితాబ్‌ బచ్చన్‌ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.

ఈ మూడు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి.వీళ్లే ఆ సినిమాకు మెయిన్‌.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

వీళ్లతో పాటు దీపికా పదుకొణె( Deepika Padukone ) పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.కొత్త వాళ్లు ఉంటారని నేను అనుకోవడం లేదు.

Ashwini Dutt About Prabhas Kalki 2898 Ad Part 2 Release Details, Ashwini Dutt, P
Advertisement

ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్‌ లో కొత్త వాళ్లు ఉండే అవకాశం ఉంది అని అన్నారు అశ్వని దత్.ఇక నాగ్అశ్విన్‌ గురించి మాట్లాడుతూ.మహానటి సినిమా తీసే సమయంలో ఎక్కడా భయం లేకుండా షూటింగ్‌ పూర్తి చేశాడు.

తర్వాత కల్కి రూపొందించాడు.రెండూ సూపర్‌ హిట్‌ గా నిలిచాయి.

నాగ్‌ అశ్విన్‌ కు జీవితంలో ఓటమనేది ఉండదని నేను నమ్ముతాను.అతడి ఆలోచనా విధానం, సినిమాలను తెరకెక్కించే తీరు చాలా గొప్పగా ఉంటాయి అని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు