శివం భజే మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

అశ్విన్ బాబు,( Ashwin Babu ) దిగంగనా సూర్యవంశీ( Digangana Suryavanshi ) కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం శివం భజే.

( Shivam Bhaje ) గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో అప్సర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఇందులో అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ లాంటి సెలబ్రిటీలు ముఖ్యపాత్రల్లో నటించారు.ఇది ఇలా ఉంటే తాజాగా నేడు అనగా ఆగస్టు 1న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది.

మరి తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? అసలు కథ ఏమిటి? ఫైనల్ గా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే.

కథ :

చందు ఒక లోన్ రికవరీ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు.చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి దేవుడిని నమ్మడం మానేస్తాడు.

లోన్ రికవరీ ప్రాసెస్ లో ఫార్మాసూటికల్ ల్యాబ్ లో పనిచేసే శైలజ(దిగంగన సూర్యవంశీ) పరిచయం అవుతారు.తర్వాత నెమ్మదిగా వీరిద్దరూ ప్రేమలో పడతారు.అయితే లోన్ రికవరీలో భాగంగా ఒకరితో గొడవ పడడంతో ఆ గొడవలో అనుకోకుండా చందు కళ్ళు పోతాయి.

Advertisement
Ashwin Babu Shivam Bhaje Movie Review And Rating Details, Shivam Bhaje, Shivam B

ఆ సమయంలోనే ఎవరో చనిపోవడంతో ఆ కళ్ళను తీసుకుని వచ్చి చందుకి అమరుస్తారు.అయితే ఆ కళ్ళు అమర్చిన క్షణం నుంచి ఈ చందు కి ఏవేవో జ్ఞాపకాలు గుర్తుకొస్తూ అవి వెంటాడుతూ ఉంటాయి.

ఇక అందులో భాగంగానే తన లైఫ్ లో చాలా మార్పులు రావడంతో పాటు దేవుడు అంటేనే భక్తి లేని నమ్మని చందు దేవుడికి దండం పెట్టడం మొదలుపెడతాడు.

Ashwin Babu Shivam Bhaje Movie Review And Rating Details, Shivam Bhaje, Shivam B

మొదటి డాక్టర్ దగ్గరికి వెళ్ళగా ఒక డాక్టర్ ఏమి చెప్పకపోగా మరొక డాక్టర్ దగ్గరికి వెళ్లడంతో చందు కి( Chandu ) కుక్క కళ్ళను అమర్చారని చెబుతాడు.అవి పోలీస్ ట్రైనింగ్ కుక్క డోగ్రె కళ్ళు అని తెలుస్తుంది.మరో వైపు చైనా పాకిస్థాన్ కలిసి ఇండియాని నాశనం చేయాలని ఒక కుట్ర పన్నుతుంటారు.

మరోవైపు వరుసగా కొంతమంది చనిపోతూ ఉంటారు.అసలు ఆ కుక్క కథ ఏంటి? కుక్క కళ్ళు చందుకు ఎలా అమర్చారు? సీరియల్ కిల్లర్ ఎవరు? చైనా పాకిస్థాన్ చేసే ప్లాన్ ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

Ashwin Babu Shivam Bhaje Movie Review And Rating Details, Shivam Bhaje, Shivam B
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

విశ్లేషణ:

ఈ మధ్యకాలంలో థ్రిల్లర్ కథాంశంతో చాలా సినిమాలు తెరకెక్కినప్పటికీ ఈ సినిమాను ఒక సరి కొత్త పాయింట్ తో తెరకెక్కించారు దర్శకుడు.ఇక ఇందులో దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగుంది.పాత్రలను ఎంచుకున్న తీరు,మల్చుకున్న విధానం బాగుంది.

Advertisement

కొత్త పాయింట్‌తో అప్సర్ అందరినీ ఆకట్టుకుంటాడు.టెక్నికల్ టీంని చక్కగా వాడుకున్నాడు.

అందరి దగ్గరి నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నాడు.శివం భజేలో అన్ని రకాల అంశాలను మేళవించాడు దర్శకుడు.

మిస్టరీ, థ్రిల్లర్, సస్పెన్స్, డివోషనల్, కామెడీ, రొమాంటిక్ యాంగిల్ ఇలా అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా మంచి స్క్రిప్ట్‌తో వచ్చాడు.కొత్త పాయింట్‌తో ఆడియెన్స్ ఆశ్చర్యపరుస్తాడు.

అప్సర్ టేకింగ్, మేకింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అవ్వాల్సిందే.స్క్రీన్ ప్లేని( Screen Play ) చాలా బాగా రాసుకున్నారు.

ఫస్ట్ హాఫ్ మొదట్లో కొంచెం బోర్ కొట్టినా ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా ఆసక్తి కరంగా మారుతుంది.

నటీనటుల పనితీరు :

నటీనటుల విషయానికి వస్తే.అశ్విన్ బాబు ఇప్పటికే థ్రిల్లర్ సినిమాల్లో అదరగొట్టాడు.మొదటి నుంచి డిఫరెంట్ కథలతో ప్రేక్షకులని మెప్పిస్తున్న అశ్విన్ బాబు ఈ సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు.

క్లైమాక్స్ ఫైట్ లో అయితే అశ్విన్ నటన( Ashwin Acting ) ఓ రేంజ్ లో ఉంటుంది.అలాగే మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు.

సాంకేతికత:

ఈ సినిమా గురించి మాట్లాడితే ముందుగా చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే.ఇందులో స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.

అలాగే సెకండాఫ్ లో ప్రతి ఒక సన్నివేశం ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది.అలాగే ఇందులో శివుడు తత్వాన్ని శివుడి విజువల్స్ ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్.

బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.పాటలు యావరేజ్ గా ఉన్నాయని చెప్పవచ్చు.

అలాగే సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగుంటాయి.ఎడిటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కథలో ఎక్కడా బోర్ కొట్టకుండా చేసారు.

నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకి బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

రేటింగ్ : 3/5

తాజా వార్తలు