అతి తెలివా? అజ్ఙానమా?

రాజకీయ నాయకులు కొందరు విచిత్రంగా వ్యవహరిస్తుంటారు.పదవి లేనప్పడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడేవారు కూడా పదవి రాగానే ఏది తోస్తే అది మాట్లాడుతుంటారు.

ఒక్కోసారి తెలివితక్కువగా, ఒక్కోసారి అతి తెలివిగా మాట్లాడతారు.ఆంధ్రప్రదేశ్‌ టీడీపీలో అశోక్‌ గజపతిరాజు పెద్దమనిషి తరహాగా ఉంటారు.

రాజవంశానికి చెందిన ఈ సీనియర్‌ రాజకీయ నాయకుడు కమ్ విమానయాన శాఖ మినిస్టర్‌ అతి తెలివితోనో, అజ్ఙానంతోనో అడిగిన ప్ర శ్న ఏమిటయ్యా అంటే.ప్రపంచంలో ఎక్కడైనా అగ్గిపెట్టె కారణంగా విమాన ప్రమాదం జరిగిందా? అలాంటి ప్రమాదం జరిగివుంటే నాకు చెప్పండి తెలుసుకోవాలని ఉంది అని అన్నారు.ఇది ఆయన కుతూహలంతో అడిగిన క్వశ్చన్‌ కాదు.

నేను విమానాల్లో ప్రయాణించేటప్పడు అగ్గిపెట్టె వెంట ఉంచుకుంటాను అని అదేదో ఘనకార్యంలా చెప్పారు.వెంటనే అధికారులు నోరెళ్లబెట్టారు.

Advertisement

మండే వస్తువులు విమానంలోకి అనుమతించరనే సంగతి అశోక్‌కు తెలుసు.ఆయనకు విమాన ప్రయాణాలు కొత్తకాదు కదా.! అగ్గిపెట్టె పెట్టుకోవడం నిబంధనలకు విరుద్ధమని కూడా తనకు తెలుసని చెప్పారు.నిబంధన బాగానేఉందిగాని అగ్గిపెట్టె కారణంగా ప్రమాదాలు జరిగాయా? చెప్పండి అని అడిగారు.ఈ ప్రవ్నకు జవాబు ఏమిటో? ఇలాంటి ప్రమాదం జరిగినట్లు మనమూ వినలేదు కదా.!.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Advertisement

తాజా వార్తలు