Ashish Vidhyarthi : నా భర్త చాలా మంచి వాడు..పెళ్లి చేసుకుంటే తప్పు ఏముంది : ఆశిష్ విద్యార్థి మొదటి భార్య

నరేష్, రమ్య రఘుపతి( Naresh, Ramya Raghupathi ) వ్యవహారం తర్వాత ఎవరూ లేటు వయసులో పెళ్లి చేసుకున్న కూడా వారు ఒక మదన కామరాజు అన్న ఫీలింగ్ చేస్తూ వస్తున్నారు.

ఇక వీరి విషయం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో రెండవ వివాహం చేసుకున్నాడు.

దాంతో ఆయన సైతం జనాలు తిట్టి పోశారు.ఈ లేటు వయసులో పెళ్లేంటి అంటూ తిట్ల దండకం మొదలు పెట్టారు.

అయితే ఆయన మొదటి భార్య ఈ విషయంపై స్పందించారు.ఆ వివరణ విన్న తర్వాత చాలా మందికి ఆశిష్ విద్యార్థిపై( Ashish Vidhyarthi ) సదభిప్రాయం కలుగుతుంది.

విద్యార్థి ప్రస్తుతం పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు రుపాలి ( rupali ).అమే వయసు 50 యేళ్లు.కేవలం 10 ఏళ్ల గ్యాప్ తోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Advertisement

ఆశిష్ విద్యార్థికి గత ఏడాది విడాకులు మంజూరు అయ్యాయి.ఆయన మొదటి భార్య పేరు రాజోషి బారువా.

ఆమె తన భర్త ఆశిష్ విద్యార్థి నుంచి విడాకులు పొందినా సరే తన ఇంటి పేరు ను మాత్రం సోషల్ మీడియా అకౌంట్స్ లో తొలగించలేదు. రాజోషి( Rajoshi ) బాలీవుడ్ నటి అయిన శకుంతల బారువా కూతురు.ఆశిష్ విద్యార్థి రెండవ వివాహం గురించి ఆమె స్పందించిన విధానం చూస్తే చాలా మంది శభాష్ అంటున్నారు.

ఇన్నాళ్లు శకుంతల కూతురుగా, ఆశిష్ కి భార్యగా సమాజంలో గౌరవం పొందాను ఇప్పుడు.ఇప్పుడు స్వతంత్రంగా ఎదగాలనుకున్నాను మేమిద్దరం నడిచే మార్గాలు వేరు కావడంతో ఒకరిపై ఒకరికి ఎలాంటి కోపం లేకపోయినా, గొడవలు లేకపోయినా కలిసి ఉండలేము అని అర్థం చేసుకొని సగౌరవం గా విడిపోయాం.

22 ఏళ్ల పాటు కలిసి జీవించాం ఒకరంటే ఒకరికి మంచి గౌరవం మర్యాద ఉన్నాయి.నా జీవితంలో అతనితో గడిపిన కాలమే ఎంతో ఉత్తమమైన కాలంగా చెప్పుకుంటాను.ఇప్పుడు విడిపోయి బయటకు వచ్చాను కాబట్టి అతడు మరో వివాహం చేసుకోవడానికి నా పూర్తి సమ్మతం ఉంటుంది.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

ఆశిష్ విద్యార్థి నన్ను మోసం చేయలేదు.తాను ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు ఉంది.

Advertisement

ఆయనకు ఒక తోడు ఉండాలి కదా నా కొడుకు అర్థ్ కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటాడు.మా ఇద్దరి మధ్య వచ్చిన అన్ని విషయాలను మా అబ్బాయి ఎంతో గౌరవంతో విన్నాడు అలాగే ఒప్పుకున్నాడు కూడా.

ఆయన వివాహానికి నా శుభాకాంక్షలు అంటూ రాజోషి తన ఇంటర్వ్యూ ని పూర్తి చేశారు.

తాజా వార్తలు