ఈటల పై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ.. !

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

అయితే ఈటల టీఆర్ఎస్ పార్టీ వీడినప్పటి నుండి దాదాపుగా గులాభి నేతలందరు ఆయన పై విమర్శలు చేశారు.

ఇంకా చేస్తూనే ఉన్నారు.ఒక్క గులాభి అధినేత కేసీఆర్, కేటీఆర్ తప్ప మిగతావారంతా ఈటల పోకడను తప్పు పడుతున్నవారే.

Mim Asaduddin Owaisi Indirect Comments On Etela Rajender, Asaduddin Owaisi, Com

కాగా తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇదే విషయాన్ని నేరుగా కాకుండా పరోక్షంగా ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో బీజేపీ పిక్చర్ అట్టర్ ఫ్లాప్ అని, అలాంటి పార్టీని నమ్ముకుని హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల దారుణంగా విఫలం అవుతారంటూ వ్యాఖ్యానించారు.

ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోను ఉకదంపుడు మాటలు మాట్లాడి చతికిల పడిన బీజేపీలోకి ఎవరు కొత్తగా చేరిన ఒరిగేదేం లేదని విమర్శించారట.

Advertisement
13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?

తాజా వార్తలు