O Saathiya Review: ఓ సాథియా రివ్యూ: మూవీ ఎలా ఉందంటే?

డైరెక్టర్ దివ్య భావన దర్శకత్వంలో రూపొందిన సినిమా ఓ సాథియా.( O Sathiya ) దివ్యభావన ఈ సినిమాతో మొదటిసారి దర్శకురాలిగా పరిచయమయ్యింది.

ఇక ఈ సినిమాలో ఆర్యన్ గౌరా,( Aryan Gowra ) మిస్తీ చక్రవర్తి,( Misty Chakravarthy ) దేవి ప్రసాద్, ప్రమోదిని, చైతన్య గరికపాటి, కల్పలత, అన్నపూర్ణమ్మ, శివన్నారాయణ, క్రేజీ కన్నా, బుల్లెట్ భాస్కర్, అంబరీష్ అప్పాజీ తదితరులు నటించారు.తన్విక - జస్విక క్రియేషన్స్ బ్యానర్ పై సుభాష్ కట్టా, చందన కట్ట ఈ సినిమాకు నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.

భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల ఈ సినిమాకు పాటలను అందించారు.విన్ను వినోద్ సంగీతం అందించాడు.

ఇక ఈ సినిమా మంచి ప్రేమ కథ నేపథ్యంలో రూపొందగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పైగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా కాబట్టి.

Advertisement

ఈ సినిమా లవ్ స్టోరీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.అర్జున్ (ఆర్యన్ గౌరా) అనే కుర్రాడు వైజాగ్ లో బీటెక్ చదువుతూ లైఫ్ నువ్వు బాగా టైం పాస్ చేస్తూ ఉంటాడు.

ఇక అతడికి కీర్తి (మిస్తీ చక్రవర్తి) కంటపడటంతో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు.అంతేకాకుండా అతడికి పడని తన క్లాస్మేట్ కూడా కీర్తిని చూసి ప్రేమలో పడతాడు.

ఇక కీర్తి( Keerthy ) నాదంటే నాది అని బాగా గొడవ పడుతూ ఉంటారు.కొట్లాట కూడా జరుగుతుంది.దీంతో కీర్తి వీళ్ల నుండి ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటుంది.

అయితే కీర్తికి అర్జున్ ఒక సలహా ఇస్తాడు.వాడు నిన్ను ఏడిపించకుండా ఉండాలంటే మనమిద్దరం ప్రేమలో ఉన్నామని అబద్ధం చెప్పు దాంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అంటాడు.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
వీడియో: ట్రంప్‌పై కోపంతో బంగారం లాంటి టీవీని నాశనం చేసిన యువతులు..

అలా అప్పటినుండి వారిద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా కలిసి తిరుగుతూ ఉంటారు.అయితే ఓసారి అర్జున్ కీర్తి కి ఫోన్ చేసి ప్రపోజ్ చేయాలని అనుకోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.ఇక ఇంటికి వెళ్లి చూస్తే ఇంటికి తాళం వేసి ఉంటుంది.

Advertisement

అలా కీర్తి కోసం బాగా తిరుగుతూ ఉంటాడు.మరి కీర్తి ఎక్కడికి వెళ్ళింది.

అసలు ఏం జరిగింది.చివరికి అర్జున్ కీర్తిని కలుస్తాడా లేదా.

కలిసిన కూడా ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

నటీనటుల నటన విషయానికి వస్తే ఆర్యన్ అర్జున్ పాత్రలో అద్భుతంగా నటించాడు.అంతేకాకుండా ఒక ప్రేమికుడిగా కూడా అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ బాగా ఆకట్టుకున్నాయి.

కీర్తి పాత్రలో నటించిన మిస్తీ చక్రవర్తి కూడా బాగానే పర్ఫామెన్స్ చేసింది.ఇక మిగతా నటీనటులంతా తమ పాత్రపు తగ్గట్టుగా పనిచేశారు.

టెక్నికల్:

ఈ సినిమాతో మొదటిసారిగా డైరెక్టర్ గా పరిచయమైన దివ్యభావన( Director Divya Bhavana ) కథను అద్భుతంగా చూపించింది.పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.

మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

విశ్లేషణ:

దివ్యభావన తొలిసారి అనుభవం ఉన్న దర్శకురాలిగా ఈ సినిమాను చూపించింది.కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం బాగా చూపించింది.

డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి.ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో బాగా చూపించింది.

ప్లస్ పాయింట్స్:

కథ, సంగీతం, క్లైమాక్స్, సినిమాటోగ్రఫీ, నటీనటుల నటన.

మైనస్ పాయింట్స్:

ఫస్టాఫ్ కాస్త స్లోగా సాగినట్లు అనిపించింది.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సింది ఏంటంటే.ఈ సినిమా ఫ్యామిలీతో పాటు మంచి లవ్ స్టోరీ సినిమాగా చూడవచ్చు.

రేటింగ్: 2.75/5

తాజా వార్తలు