సక్సెస్ సాధించాలంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కష్టంతో వచ్చే కసితో కష్టపడితే కచ్చితంగా సక్సెస్ దక్కుతుందని దిల్ ఖుష్ సింగ్( Dilkhush Singh ) ప్రూవ్ చేశారు.
బీహార్ రాష్ట్రానికి( Bihar ) చెందిన దిల్ ఖుష్ సింగ్ ఈ స్థాయికి చేరుకోవడం కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు.సహర్సాలోని చిన్న గ్రామంలో జన్మించిన దిల్ ఖుష్ సింగ్ చదివింది ఇంటర్ మాత్రమే అయినా ఎంతోమందికి ఉపాధి కల్పించాడు.
ప్రస్తుతం దిల్ ఖుష్ సింగ్ ఆదాయం ఏడాదికి 20 కోట్ల రూపాయలుగా ఉంది.ఒకప్పుడు దిల్ ఖుష్ సింగ్ రిక్షా తొక్కి( Rickshaw ) జీవనం సాగించాడు.
ఆ తర్వాత దిల్ ఖుష్ సింగ్ బ్రతుకుతెరువు కోసం కూరగాయలు సైతం అమ్మాడు.ఆ తర్వాత దిల్ ఖుష్ సింగ్ రాడ్ బెజ్ అనే కంపెనీని మొదలుపెట్టి బీహార్ లో క్యాబ్ లను అమ్మడం మొదలుపెట్టాడు.
ఈ క్యాబ్ ద్వారా నగరం నుంచి 50 కిలోమీటర్ల వరకు సర్వీస్ లను అందిస్తున్నాడు.

ఆ తర్వాత దిల్ ఖుష్ సింగ్ ఆర్య గో క్యాబ్స్( AryaGo Cabs ) అనే సంస్థను మొదలుపెట్టాడు.టాటా నానో కారుతో కంపెనీని మొదలుపెట్టిన దిల్ ఖుష్ తక్కువ సమయంలోనే కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగాడు.ప్రస్తుతం దిల్ ఖుష్ సింగ్ సంపాదన 20 కోట్ల రూపాయలుగా ఉంది.
నా సంపాదన 100 కోట్ల రూపాయలకు చేరాలని దిల్ ఖుష్ సింగ్ వెల్లడిస్తున్నారు.కంపెనీలో పని చేసే డ్రైవర్లకు( Drivers ) మేలు జరిగేలా దిల్ ఖుష్ సింగ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తన ఫ్లాట్ ఫామ్ ద్వారా ఒక డ్రైవర్ 60 వేల రూపాయల వరకు సంపాదించవచ్చని దిల్ ఖుష్ సింగ్ వెల్లడిస్తున్నారు.ఐఐటీ, ఐఐఎంలలో చదివిన వాళ్లు సైతం నా దగ్గర పార్ట్ టైమ్ గా పని చేస్తున్నారని దిల్ ఖుష్ సింగ్ చెబుతున్నారు.దిల్ ఖుష్ సింగ్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.








