తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం రాక

తెలంగాణలో త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతుంది.ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం రానుంది.

దాదాపు మూడు రోజులపాటు సీఈసీ బృందం హైదరాబాద్ లోనే ఉండనుందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది.

ఎన్నికల నిర్వహణ వ్యవహారంపై వారితో సీఈసీ బృందం చర్చించే అవకాశం ఉంది.కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ సెప్టెంబర్ లో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!
Advertisement

తాజా వార్తలు