తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి ఏర్పాట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువు దీరిన తిరుమలలో వైకుంఠ ఏకాదశిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు.

ఇందులో భాగంగా ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తారు.

ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి దర్శనం జనవరి 2వ తేదీన ప్రారంభం అవుతుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.పది రోజులపాటు దర్శనం ఉంటుందని, ప్రత్యేక దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో రోజుకు 25 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఆధార్ కార్డు ఉన్న వారికి మాత్రమే దర్శనం టోకెన్లు ఇస్తామని పేర్కొన్నారు.రోజుకు 50 వేల ఉచిత దర్శనం టోకెన్లు అందిస్తామన్నారు.

జనవరి 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటర్లు ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు.ఈ క్రమంలో టోకెన్లు ఉంటేనే వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం కల్పిస్తామని తెలిపారు.

Advertisement
ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. : అమిత్ షా

తాజా వార్తలు