భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు..

ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయంలో ఫిబ్రవరి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించనున్నట్లు ఉత్సవాలను భక్తులు మెచ్చుకునేలా నిర్వహిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ వెల్లడించారు.

బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్సవాలకు రోజుకు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారికి ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలని వెల్లడించారు.

భక్తులు, వృద్ధులు, వికలాంగులకు, మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సులను ఏర్పాటు చేశామని వెల్లడించారు.పార్కింగ్ ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని వెల్లడించారు.

వంతెన వద్ద అధికారులు ప్రత్యేకంగా ట్రాఫిక్ పర్యవేక్షించాలని పురుషులకు, స్త్రీలకు ప్రత్యేకంగా స్నానాల గదులను ఏర్పాటు చేయాలని వెల్లడించారు.భక్తులకు అందించే వైద్యం విషయంలో అశ్రద్ధ వహించవద్దన్నారు.

Advertisement
Arrangements For Mahashivratri Celebrations Without Any Difficulties For Devotee

మంచినీరు, బయో టాయిలెట్లను ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.సాగర్ కాల్వ పై రెండవ వంతెనను నిర్మించేందుకు రూ.7.65 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు.

Arrangements For Mahashivratri Celebrations Without Any Difficulties For Devotee

ఇంకా చెప్పాలంటే మార్కాపురంలోని శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయంలో జనవరి 28వ తేదీ జరిగే రథసప్తమి వేడుకలు విజయవంతంగా మొదలయ్యాయి.స్థానిక ఆలయంలో రథసప్తమికి సంబంధించిన పోస్టర్ ను కూడా కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు.జనవరి 28 తేదీన ఉదయం 5 గంటల నుంచి సూర్యప్రభ వాహనం, 9 గంటలకు శేష వాహనం, 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటలకు దేవాలయంలో శ్రీ చక్రస్నానం, మూడు గంటలకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య వెండి రథం పై స్వామికి రథోత్సవం, 8 గంటలకు చంద్ర ప్రభా వాహనంపై నాలుగు మడవిధులలో నగర ఉత్సవం నిర్వహించినట్లు దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పి.కేశవరావు, పిఓజీ శ్రీనివాసరెడ్డికి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు