ప.గో.జిల్లాలో ఈనెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు రైతు పొరు బాట పేరుతో పర్యటించనున్నారు తణుకు నియోజకవర్గంలో సూమారు 12కిలో మిటర్లు మేర పాదయాత్ర చేసి రైతులకు మద్దతుగా నిలవనున్నారు.టీడీపీ ఆధ్వర్యంలో జరిగే రైతు పోరుబాట పాదయాత్రలో పాల్గొననున్న చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఎర్పాట్లులపై బాగో జిల్లా టిడిపి అధ్యక్షురాలు మాజీ ఎంపీ సీతారామలక్ష్మి
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ జిల్లాకు సంబంధించిన ఇతర టిడిపి నేతలు పాదయాత్ర జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు ఇరగవరం నుంచి తణుకు వై జంక్షన్ వరకు పాదయాత్ర కొనసాగనున్నది.
ముఖ్యంగా ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పాదయాత్ర చేయనున్నారు రైతు పోరుబాటలో భాగంగా ఈ నెల 11న కలెక్టరేట్ లు, ఎమ్మార్వో కార్యాలయాల వద్ద టిడిపి శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చారు