ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలో ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు.
ఇలా సెలబ్రిటీ కపుల్స్ గా ఇండస్ట్రీలో ఎంతోమంది కొనసాగుతూ మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి నటుడు ఆది పినిశెట్టి( Adi Pinishetty ) నటి నిక్కి గల్రాణి ( Nikki galrani ) కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా వైవాహిక జీవితంలో వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.
పెళ్లికి ముందే వీరిద్దరూ పలు సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే.
వీరిద్దరి కాంబినేషన్లో ఏ ఆర్ కె శరవన్( ARK Saravan ) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం మరగత నానయం( Maragatha Naanayam ) 2017 వ సంవత్సరంలో విడుదలైనటువంటి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలు దర్శకనిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోని ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో మరోసారి ఆది నిక్కి తెరపై సందడి చేయబోతున్నారు.
ఈ క్రమంలోనే దాదాపు 5 సంవత్సరాల తర్వాత మరోసారి ఆది పినిశెట్టి, నిక్కీ కాంబినేషన్లో మరగత నానయం సినిమా సీక్వెల్ చిత్రం రాబోతోంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.ఇలా పెళ్లి తర్వాత మొదటిసారి వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా తెరపై సందడి చేయబోతున్నారన్న విషయం అభిమానులను ఎంతో సంతోషానికి గురి చేసింది.
ఆది పినిశెట్టి ప్రస్తుతం తమిళ సినిమాలతోనూ అలాగే తెలుగు సినిమాలలో కూడా బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈయన పలు సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy