చిత్రం : అర్జున్ రెడ్డి బ్యానర్ : భద్రకాళి పిక్చర్స్ దర్శకత్వం : సందీప్ వంగ నిర్మాతలు : ప్రణయ్ వంగసంగీతం : రాదన్విడుదల తేది : ఆగష్టు 25, 2017నటీనటులు : విజయ్ దేవరకొండ, శాలిని పాండే
సైడ్ క్యారక్టర్స్ తో కెరీర్ మొదలుపెట్టి, పెళ్లి చూపులు అనే ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ.ద్వారక నిరాశపరిచినా, అర్జున్ రెడ్డి ఆలస్యంగా వస్తున్నా, ఈమధ్య కాలంలో ఏ సినిమాకి లేని హైప్, క్రేజ్ సొంతం చేసుకుంది ఈ సినిమా.
హైదరాబాద్ లో ప్రీమియర్స్ కి, మొదటిరోజు ఆటలకి, టికెట్ ముక్క దొరికితే ఒట్టు.అంతటి హైప్ లో వచ్చిన అర్జున్ రెడ్డి అంచనాలను అందుకుందో లేదో చూడండి
కథలోకి వెళితే :
అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) ఒక మెడికల్ స్టూడెంట్.కాని మెడికల్ స్టూడెంట్ లో మనం సాధారణంగా గమనించే సున్నితత్వం అతనిలో ఉండదు.స్వాతంత్ర్య భావాలతో పాటు విపరీతమైన కోపం ఉన్న మనిషి.చూడగానే తన జూనియర్ ప్రీతి (శాలిని పాండే) ని ప్రేమిస్తాడు.ప్రీతి అర్జున్ ని తిరిగి ప్రేమిస్తుంది.
ఎన్నో కలలు కంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు.కాని ప్రీతికి మరొకరితో పెళ్లి చేయించేస్తాడు ఆమె తండ్రి
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమవడంతో అర్జున్ రెడ్డి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు.
మానసికంగా, శారీరకంగా తనకు తానే భారమైపోతాడు.అతని మానసిక సంఘర్షణ కథని ఎలాంటి మలుపులు తిప్పిందో తెర మీద చూడండి.
నటీనటుల నటన :
ఒక కొత్త స్టార్ పుట్టేసాడు.పెళ్లి చూపులు చూసిన తరువాత విజయ్ మరో లవర్ బాయ్ అవుతాడు అనుకున్నారంతా.
కాని విజయ్ కేవలం ఒక లవర్ బాయ్ గా ఉండకూడదు, ఉండటం కూడా కష్టం.వేలమంది కుర్రాళ్ళు తమని తాము అర్జున్ రెడ్డిలో చూసుకుంటారు.అంతలా పాత్రలో జీవించేసాడు అర్జున్.ఫస్టాఫ్ లో వీర లెవల్ ఆటిట్యూడ్ ఎంత నేచురల్ గా అనిపిస్తుందో, సెకండాఫ్ లో అతని మానసిక స్థితి అంతే సహజంగా అనిపిస్తుంది.
గత కొన్నేలల్లో విజయ్ లాంటి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన యువ నటుడు ఎవరో కూడా గుర్తుకు రావట్లేదు.మరికొన్ని ఏళ్ల వరకు ఒక యువనటుడు సాధారణంగా నటించాలి అంటే కూడా భయపడాలి.
ఇదంతా అతిశయోక్తి కాదు.విజయ్ దేవరకొండ లిటరల్ గా విశ్వరూపం చూపించేసాడు.
ఒక్క సీన్ గా స్పెషల్ గా అని చూపించలేం.ఆద్యంతం తానూ వెండితెర మీద కొత్త తారని కాబోతున్నాను అనేంత కసి అతనిలో కనిపిస్తుంది
కొత్తమ్మాయి శాలిని పాండే నుంచి కూడా మంచి నటన రాబట్టుకోవడంలో సఫలమయ్యాడు దర్శకుడు.
ఫక్తు తెలుగు సినిమా హీరోయిన్ లా కాకుండా సింపుల్ గా, సహజంగా ఉంది అమ్మాయి.విజయ్ ఫ్రెండ్ పాత్రలో కనిపించిన నటుడు ప్రేక్షకులకి గుర్తుండిపోతాడు
విశ్లేషణ :
సంగీతం సింపుల్ గా సినిమా టోన్ కి తగ్గట్టుగా ఉంది.అర్జున్ రెడ్డి టీజర్స్ లో వినిపించిన సిగ్నేచర్ థీం థియేటర్లో కూడా ఉర్రూతలూగిస్తుంది.కెమెరా వర్క్ బాగుంది.ఎడిటింగ్ సెకండాఫ్ లో కొద్దిగా ట్రాక్ తప్పుతుంది.దర్శకుడు సందీప్ వంగ కథని చాలా ఎంటర్టైనింగ్ గా చెబుతూనే, చాలా గట్టిగా, ప్రతి భావం అర్తంమేయ్యేలా చెప్పారు.
ఎదో కావాలని బూతులు పెట్టలేదు.ఈకాలంలో యువత ఎలాంటి పరిస్థితికి ఎలాంటి పదాలు వాడుతుందో, అలాంటి పదాలే పడినా, చాలవవరకు బీప్ అవడం కొంచెం ఇబ్బందికి గురిచేస్తుంది.
ఓవర్సీస్ లో బీప్స్ లేకపోవడం అక్కడి ప్రేక్షుకుల అదృష్టం.ఎందుకంటే అర్జున్ రెడ్డి క్యారక్టర్ వెళుతున్న ఊపులో బీప్స్ ఇర్రిటేటింగ్ గా అనిపిస్తాయి
ఎన్నో ప్రేమ కథలు చూసాం, ప్రతి సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది.
కాని ప్రతి లవ్ స్టోరిని మనం ఎందుకు ఫీల్ అవలేకపోతున్నాం, అర్జున్ రెడ్డి – ప్రీతిలకు ఎందుకు కనెక్ట్ అవుతాం అంటే, మనం బయట వినే సంభాషణలే ఉండటం వలన, ఎక్కడ కూడా జప జప ఫ్రేమ్స్ మారుస్తూ సినిమాలో వేగం పెంచే ప్రయత్నం చేయకపోవడం వలన.బూతులు ఉండటం వలన ఈ సినిమా యువత కనెక్ట్ అవుతుంది అనుకుంటే పొరపాటే.RAW & RUGGED స్టయిల్ లో కథని చెప్పడం వలన యువత కనెక్ట్ అవుతుంది.ఓ ఖుషి, ఒక 7/G బృందావన కాలనిల తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకు తెలుగు సినిమాకి ఒక కల్ట్ లవ్ స్టోరి దొరికింది.
సెకండాఫ్ నిడివి తగ్గించాల్సింది.సినిమాకి ఏమైనా నెగెటివ్ పాయింట్ ఉంటే అది సెకండాఫ్ లో నెమ్మదించిన నరేషన్ మాత్రమే
అయినా సరే, చరిత్రలో మొదటిసారి తొలిరోజే పెట్టిన డబ్బు మొత్తం రికవర్ చేసే సినిమా కాబోతోంది అర్జున్ రెడ్డి.
సెకండాఫ్ స్లో గా ఉన్నా, నిడివి ఎక్కువైనా, కాస్త ఓపిక పట్టి అమ్మాయిలు, అబ్బాయిలు దీన్ని బ్లాక్ బస్టర్ చేస్తారు.నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో/ సినిమా ఆడుతున్న ఓవర్సీస్ థియేటర్లలో అర్జున్ రెడ్డి జాతర షురూ
ప్లస్ పాయింట్స్ :
* విజయ్ దేవరకొండ అద్భుత నటన * సందేప్ నేచురల్ టేకింగ్ * కట్టిపడేసి భావోద్వేగాలు* ఫస్టాఫ్
మైనస్ పాయింట్స్ :
* నిడివి * నెమ్మదించిన సెకండాఫ్
చివరగా :
యువతరానికి సరికొత్త క్లాసిక్