ఈమెకు నీటి గండం.. నీరు తాగితే మరణమే

రోజూ స్నానం చేయడం మనకు చిన్నతనం నుండి వస్తున్న అలవాటు.కానీ ఆమె మాత్రం అందుకు విభిన్నం.

ఆమె పొరపాటున స్నానం చేసిందంటే చాలు ఆసుపత్రి బాట పట్టాల్సిందే.ఒక్క స్నానం చేయడమే కాదు కనీసం ఆమెకు బాధ కలిగితే ఏడ్చే అవకాశం కూడా లేదు.

ఎక్కడ నీరు తగులుతుందో అని ఆమెకు చచ్చేంత భయం.అందుకే, ఆ సీజన్లో ఎక్కువగా ఇంట్లోనే ఉంటుంది.ఆమెకు ‘వాటర్ అలర్జీ’ అనే సమస్య ఉంది.

వివరాల్లోకి వెళ్తే.అరిజోనాలోని టక్సన్‌కు చెందిన అబిగైల్ బెక్ అనే 15 ఏళ్ల టీనేజర్ ‘ఆక్వాజెనిక్ ఉర్టికేరియా’ అనే వ్యాధితో బాధపడుతోంది.

Advertisement

అంటే ఈమె శరీరానికి నీరు తగిలితే ఈమె శరీరంపై దద్దర్లు ఏర్పడతాయి.అందుకే ఆమె తల్లిదండ్రులు.

ఒక ఆమె కంటి నుండి ఒక్క కంటి చుక్క కూడా రాలకుండా జాగ్రత్తపడతారు.ఈ సమస్యల వల్ల బెక్ కనీసం నీరు తాగడానికి కూడా వీలు లేదు.

కేవలం ఎనర్జి డ్రింక్స్ లేదా దానిమ్మ జ్యూస్ తాగుతుంది.ఎందుకంటే.

ఆమె మనలా నీరు తాగితే మరణించే ప్రమాదం కూడా ఉంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

బెక్ తన సమస్య గురించి మాట్లాడుతూ.‘‘నా కళ్ల నుంచి కన్నీరు వచ్చినా చాలు.ముఖం ఎర్రబడి కాలిపోతున్నట్లు అనిపిస్తుంది.

Advertisement

ఏదైనా బాధ కలిగితే ఎవరైనా ఏడుస్తారు.కానీ, ఆ ఏడుపు నన్ను శరీరకంగా మరింత బాధిస్తుంది.

అందుకే, కన్నీళ్లు వస్తే.అవి చర్మం మీదకు రాకుండా జాగ్రత్తపడతాను’’ అని తెలిపింది.

ఈ వ్యాధి సాధారణంగా చాలామందిలో ఉంటుంది.కానీ, ఈమెకు మోతాదు ఎక్కువ.

అందుకే, ఆమె రెండు రోజలకు ఒకసారి మాత్రమే స్నానం చేస్తుంది.ఆ వెంటనే మందులు వేసుకుని బాధను కంట్రోల్ చేసుకుంటుంది.

తాజా వార్తలు