కడుపు నొప్పి, ఉబ్బరం సమస్యలతో బాధడుతున్నారా..? అయితే వీటిని తీసుకోండి..

ఈ మధ్యకాలంలో చాలామంది కడుపు సమస్యలతో బాధపడుతున్నారు.ప్రతి ఒక్కరికి కడుపు సమస్యలు ఉండడం సాధారణమే.

అయితే చాలామందికి తరచూ కడుపునొప్పి ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది.అయితే దీనికి ప్రధాన కారణం తిన్నది అరగకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండడం అని చెప్పవచ్చు.

దీని వలన వాంతులు, అతిసారం, మలబద్ధకం లాంటివి కూడా వస్తూ ఉంటాయి.అయితే ఈ సమయంలో సాధారణంగా పొత్తికడుపు( Abdomen ) నొప్పిగా కూడా ఉంటుంది.

ఇది పెద్ద ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ ఆ సమయంలో చాలా ఇబ్బంది కలుగుతుంది.ఏ పని కూడా సక్రమంగా జరగనివ్వదు.

Advertisement

అందుకని ఇది నివారించడం చాలా అవసరం.అందుకే పేగుల ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

పోశాకహార నిపుణులు లోవనీత్ పాత్ర ఈ సూపర్ ఫుడ్స్ గురించి వివరించారు.ఫైబర్ లేదా కొవ్వు పదార్థాలు నివారించడం వలన కడుపు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.

అలాగే సులభంగా జీర్ణమయ్యే సాధారణ కార్బోహైడ్రేట్లు, లింక్ ప్రోటీన్లు( Carbohydrates, link proteins ) కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.అయితే కడుపునొప్పిని నయం చేసే సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అల్లం లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

ఇది కడుపునొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.లైకోరేస్ కడుపు లైనింగ్ వాపును తగ్గిస్తుంది.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

అలాగే పొట్టలో ఉండే రక్షిత శ్లేష్మం ఉత్పత్తిని కూడా పెంచుతుంది.

Advertisement

ఫ్లాక్ సీడ్స్ కూడా జీర్ణ వ్యవస్థ కు బాగా ఉపయోగపడుతుంది.అరటిపండు( banana ) తీసుకోవడం వలన కూడా మంచి ఫలితాలు ఉన్నాయి.ఇందులో ప్రియో బయోటిక్ లక్షణాలు కలిగి ఉన్నాయి.

పెక్టిన్ కంటెంట్ పెగులోని అదనపు ద్రవాన్ని గ్రహిస్తుంది.అలాగే మలాన్ని దృఢంగా చేస్తుంది.

ఇక అతిసారం త్వరితగతిన తగ్గడానికి సహాయపడుతుంది.ఇక ప్రో బాయోటిక్స్ అధికంగా ఉండే హారాన్ని తీసుకోవడం మంచిది.

ఇది ప్రేగులకు మంచి బ్యాక్టీరియాను అందిస్తాయి.అలాగే గ్యాస్, ఉబ్బరం లేదా క్రమ రహిత ప్రేవు కదలికల లక్షణాలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

తాజా వార్తలు