పదవీ విరమణ ప్రణాళిక చాలా ముఖ్యమైనది.ఎందుకంటే ఇది మీరు పని మానేశాక సౌకర్యవంతంగా జీవించడానికి తగినంత డబ్బు సహాయం చేస్తుంది.
పదవీ విరమణ కోసం డబ్బు వెనకేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.అయితే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం అనేది ఒక ఉత్తమమైన పని.మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా మంది వ్యక్తుల నుంచి డబ్బును సేకరించి, వివిధ రకాల స్టాక్‌లు, బాండ్లలో పెట్టుబడి పెట్టే ఒక రకమైన పెట్టుబడి.2023లో ఐదు అత్యుత్తమ పెన్షన్ ప్లాన్‌లు చాలామంది ఈ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.పెన్షన్ ప్లాన్‌లు అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్, ఇది పదవీ విరమణ కోసం ఆదా చేయడంలో ప్రత్యేకంగా ఉంటాయి.మరి అత్యుత్తమ పెన్షన్ మ్యూచువల్ ఫండ్స్ ఏవో చూద్దాం.
1.మాక్స్ లైఫ్ హై గ్రోత్ ఫండ్:
ఈ ఫండ్ అత్యధికంగా 10 సంవత్సరాల పాటు రాబడిని అందించింది.అయితే 1-నెల రాబడి ఇతర ఫండ్‌ల కంటే తక్కువగా ఉంటుంది.దీర్ఘకాలిక పదవీ విరమణ ప్రణాళికకు ఇది మంచి ఎంపిక.ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మారుతాయి కాబట్టి దీనిలో ఇన్వెస్ట్ చేసే ముందు వాటిని తెలుసుకోవడం మంచిది.ఫండ్ ప్రస్తుతం AUM రూ.3.5 కోట్లు.ఈ మ్యూచువల్ ఫండ్ నికర ఆస్తి విలువ (NAV) రూ.107.06.అయితే 10 ఏళ్ల క్రితం ఈ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు 30 శాతానికి పైగా రాబడిని అందుకున్నారు.

2.టాటా AIA హోల్ లైఫ్ మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్:
ఈ ఫండ్ అత్యధిక 10-సంవత్సరాలుగా అత్యధిక రాబడి అందిస్తూ చాలామందికి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది, ఇది అధిక సంవత్సరపు రాబడిని అందిస్తుంది.
3.ఆదిత్య బిర్లా సన్ లైఫ్ – ఇండివిజువల్ మల్టిప్లైయర్ ఫండ్:
ఈ ఫండ్ 10 ఏళ్లలో అత్యధిక రాబడిని అందించింది.ఒక ఏడాది సమయానికి కూడా మంచి రాబడిని కలిగి ఉంది.

4.హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ప్రోగ్రోత్ ప్లస్ – ఆపర్చునిటీస్ ఫండ్:
ఈ ఫండ్ 10-ఇయర్ హైయ్యెస్ట్ రిటర్న్స్ అందిస్తూ చాలామందిని ఆకట్టుకుంటుంది.
5.బజాజ్ అలయన్జ్ లైఫ్ – యాక్సిలరేటర్ మిడ్ క్యాప్ ఫండ్ II:
ఈ ఫండ్ మంచి 10-సంవత్సరాల రాబడి, మితమైన సంవత్సరపు రాబడిని కలిగి ఉంది.ఈ ప్లాన్‌ను ఎంచుకునే ముందు మీరు మీ పెట్టుబడి లక్ష్యాలను, రిస్క్ టాలరెన్స్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి.







